
నటి రూపా అయ్యర్ ప్రేమ వివాహం
నటి, దర్శకురాలు అయిన రూపా అయ్యర్ తన చిత్రానికి సంగీత బాణీలు సమకూర్చిన, సంగీత దర్శకుని ప్రేమించి వివాహమాడారు.
నటి, దర్శకురాలు అయిన రూపా అయ్యర్ తన చిత్రానికి సంగీత బాణీలు సమకూర్చిన, సంగీత దర్శకుని ప్రేమించి వివాహమాడారు. శ్రీయ నటించిన చంద్ర చిత్రానికి రూపా అయ్యర్ దర్శకత్వం వహించారు. అంతేకాకుండా పలు చిత్రాల్లోనూ రూపా అయ్యర్ నటిస్తున్నారు. చంద్ర చిత్రానికి సంగీత దర్శకునిగా గౌతమ్ శ్రీవత్స పనిచేశారు.
చిత్రంలో పని చేస్తుండగా ఇరువురి మధ్య ప్రేమ చిగురించింది. ఇది ప్రేమ వివాహం అయినప్పటికీ దీని గురించి గౌతమ్ మాట్లాడుతూ ఇది రెండు కుటుంబాల సమ్మతితో జరిగిన వివాహమే అని తెలిపారు. మూడు ఏళ్లుగా తమను వివాహం చేసుకోమని ఇరు కుటుంబీకులు కోరుతున్నారని చెప్పారు. చిత్రాలతో తాము బిజీగా ఉండడంతో వివాహాన్ని వాయిదా వేస్తూ వచ్చామని, ప్రస్తుతం ఇది నెరవేరిందన్నారు. తమ వివాహం బెంగళూరులో సంప్రదాయ పద్ధతిలో జరిగిందని వెల్లడించారు.