రొమాంటిక్ లవ్‌స్టోరి... | romantic love story | Sakshi
Sakshi News home page

రొమాంటిక్ లవ్‌స్టోరి...

Feb 7 2014 11:54 PM | Updated on Sep 2 2017 3:27 AM

సుమన్, బిందు, సౌమ్య, సురేఖవాణి ముఖ్య తారలుగా సీహెచ్‌వీ సుమన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రొమాంటిక్ లవ్‌స్టోరి’. వి.అశోక్‌కుమార్ రెడ్డి సమర్పణలో చెరువుపల్లి వెంకట నరేంద్రబాబు నిర్మిస్తున్నారు.

సుమన్, బిందు, సౌమ్య, సురేఖవాణి ముఖ్య తారలుగా సీహెచ్‌వీ సుమన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రొమాంటిక్ లవ్‌స్టోరి’. వి.అశోక్‌కుమార్ రెడ్డి సమర్పణలో చెరువుపల్లి వెంకట నరేంద్రబాబు నిర్మిస్తున్నారు. చిత్రసంగీత దర్శ కుడు అమోఘ్ దేశపతి సారథ్యంలో ఈ చిత్రం పాటల రికార్డింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రేమ, వినోదం, సెంటిమెంట్ సమాహారంతో రూపొందిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. ఈ నెల 14న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు-పాటలు: భాషశ్రీ, కెమెరా: సత్యానారాయణ.

Advertisement
 
Advertisement
Advertisement