హీరోగా పూరి విలన్..! | rogue villain anoop singh turns hero | Sakshi
Sakshi News home page

హీరోగా పూరి విలన్..!

May 10 2017 3:48 PM | Updated on Sep 5 2017 10:51 AM

హీరోగా పూరి విలన్..!

హీరోగా పూరి విలన్..!

పూరి దర్శకత్వంలో తెరకెక్కిన రోగ్ సినిమాతో విలన్గా దక్షిణాది ప్రేక్షకులను పలకరించాడు థాకూర్ అనూప్ సింగ్

పూరి దర్శకత్వంలో తెరకెక్కిన రోగ్ సినిమాతో విలన్గా దక్షిణాది ప్రేక్షకులను పలకరించాడు థాకూర్ అనూప్ సింగ్. మిస్టర్ వరల్డ్గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అనూప్, బాలీవుడ్లో తెరకెక్కిన మహాభారత్ సీరియల్లో ధృతరాష్ట్రుడిగా నటించాడు. సౌత్లో ముందుగా రోగ్ సినిమాలో నటించినా.. సింగం 3 సినిమా ముందు రిలీజ్ అయ్యింది. తరువాత విన్నర్, రోగ్ సినిమాల్లో ఆకట్టుకున్న థాకూర్ అనూప్ సింగ్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

కన్నడ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న సునీల్ కుమార్ దేశాయ్ తెరకెక్కిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో హీరోగా మారుతున్నాడు అనూప్. ఈ సినిమాలో కబాలి ఫేం ధన్సిక హీరోయిన్గా నటిస్తోంది. తన తొలిచిత్రం నుంచే ఓన్గా డబ్బింగ్ చెప్పుకుంటున్న అనూప్, కన్నడ వర్షన్కు కూడా స్వయంగా డబ్బింగ్ చెప్పేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు బ్యాడ్ బాయ్ పాత్రల్లోనే ఆకట్టుకున్న ఈ యువ నటుడు, హీరోగానూ మెప్పిస్తానంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement