స్పెషల్ డైట్! | Ritika Singh in Venkatesh's movie | Sakshi
Sakshi News home page

స్పెషల్ డైట్!

Aug 14 2016 12:06 AM | Updated on Sep 4 2017 9:08 AM

స్పెషల్ డైట్!

స్పెషల్ డైట్!

వెంకటేశ్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మాధవన్ హీరోగా తమిళంలో

 వెంకటేశ్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మాధవన్ హీరోగా తమిళంలో ‘ఇరుది సుట్రు’, హిందీలో ‘సాలా కడూస్’గా విడుదలైన సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల 7న మొదలు కానుందని సమాచారం. కథలో కొన్ని మార్పులు చేర్పులు చేశారట. ఒరిజినల్ వెర్షన్‌లో కథానాయికగా నటించిన రితికా సింగ్ తెలుగులోనూ నటించనున్నారు.

 ఒరిజినల్ సినిమాకి స్వరాలందించిన సంగీత దర్శకుడు సంతోశ్ నారాయణ్ తెలుగు సినిమాకీ బాణీలు అందిస్తున్నారు. రెండు నెలల్లో షూటింగ్ పూర్తి చేయడానికి పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ఈ సినిమాలో వెంకీ బాక్సింగ్ కోచ్‌గా కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం ప్రస్తుతం కాస్త కండలు పెంచే పనిలో నిమగ్నమయ్యారు. స్పెషల్ డైట్ తీసుకుంటున్నారాయన. విశాఖ నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement