వీహెచ్‌కు ముద్దిచ్చిన వర్మ! | RGV Posts Kissing VH in Doctered Picture, trolled | Sakshi
Sakshi News home page

వీహెచ్‌కు ముద్దిచ్చిన వర్మ!

Aug 26 2017 7:10 AM | Updated on Sep 19 2019 8:28 PM

వీహెచ్‌కు ముద్దిచ్చిన వర్మ! - Sakshi

వీహెచ్‌కు ముద్దిచ్చిన వర్మ!

పెళ్లి చూపులు ఫేం విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి చిత్రం శుక్రవారం విడుదలైంది.

సాక్షి, ప్రత్యేకం: పెళ్లి చూపులు ఫేం విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి చిత్రం శుక్రవారం విడుదలైంది. మొదట నుంచి అనుకున్నట్లు గానే.. బోల్డ్ మూవీగా వచ్చిన ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌తో పాటు రిలీజ్‌కు ముందు కాంగ్రెస్‌ నేత వీ హనుమంతరావు సినిమా పోస్టర్లు చించేయడంతో సినిమాకు కావల్సినంత పబ్లిసిటీ వచ్చేసింది.

సినిమా పోస్టర్ యూత్‌ను చెడగొట్టేలా ఉందని వీహెచ్ చించేస్తే... వీహెచ్ దుస్తులు చించేయాలని రామ్‌ గోపాల్‌ వర్మ విజయ్‌కు సూచించడంతో వివాదం రాజుకుంది. అయితే.. ఈ వ్యవహారంపై ఎవరో ఎడిట్ చేసిన ఫొటోను ఆర్జీవీ తన ఖాతాలో పోస్ట్ చేశాడు.
 
గతంలో అనురాగ్ కశ్యప్‌కు ముద్దు పెడుతూ ఇన్‌స్టాగ్రాంలో ఆర్జీవీ ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో అనురాగ్‌కు బదులు వీహెచ్‌కు వర్మ ముద్దు పెడుతున్నట్లు ఓ ఫొటోను ఎవరో ఎడిట్ చేశారు. ఆ ఎడిట్ చేసిన ఫొటోను వర్మ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి వెటకారంగా కామెంట్స్ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement