ఆగిన ప్రియాంక చోప్రా తమ్ముడి పెళ్లి!

Reports Says Priyanka Chopra Brother Wedding Called Off - Sakshi

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా తమ్ముడు సిద్ధార్థ చోప్రా పెళ్లి ఆగిపోయింది. కొంతకాలం కిందట తన చిరకాల స్నేహితురాలు ఇషితా కుమార్‌తో సిద్ధార్థ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలోనే వీరి వివాహం జరుగనుందని.. అందుకే ప్రియాంక భారత్‌కు వచ్చారని ఇటీవల వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఇషితా అనారోగ్యంతో బాధ పడుతున్న కారణంగా ఇరుకుటుంబాలు పెళ్లి వాయిదా వేయాలని భావించారంటూ రూమర్లు ప్రచారమయ్యాయి. అయితే తాజా సమాచారం ప్రకారం సిద్ధార్థ- ఇషితాల పెళ్లి ఆగిపోయింది. ఈ విషయాన్ని ప్రియాంక తల్లి మధు చోప్రా ధ్రువీకరించారు. పరస్పర అంగీకారంతోనే పెళ్లి ఆపేసినట్లు పేర్కొన్నారు. అదే విధంగా ఇషితా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుల ద్వారా ఈ విషయం స్పష్టమవుతోంది.

చదవండి : మీ ఇల్లు చాలా అద్భుతంగా ఉంది!

కొత్త జీవితానికి ప్రారంభం..
నిశ్చితార్థ సమయంలో సిద్ధార్థ చోప్రా, ప్రియాంక, నిక్‌ జోనస్‌లతో పాటు ఇతర కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలను ఇషితా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ నుంచి డెలిట్‌ చేశారు. ఈ క్రమంలో..‘ కొత్త ఆరంభాలకు చీర్స్‌.. అందమైన ముగింపులకు గుడ్‌బై కిస్‌తో వీడ్కోలు’ అంటూ తన సింగిల్‌ ఫొటోను ఆమె షేర్‌ చేశారు. ఇందుకు స్పందించిన ఆమె తల్లి నిధి కుమార్‌.. ‘పాత పుస్తకం మూసెయ్‌..కొత్తది రచించు’ అంటూ కామెంట్‌ చేయగా.. ‘ మేము ఎల్లప్పుడూ నీతోనే ఉంటాం. విశ్వంలో వెలిగే సరికొత్త తారలా నువ్వు అవతరించాలి’ అంటూ ఇషితా తండ్రి ఆమెకు అండగా నిలిచారు. ‘అతడి గురించి ఆలోచించడం వేస్ట్‌. నీకు తగినవాడు కానే కాదు. అంతకన్నా మంచి వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందుతావు. నీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం’ అని ఆమె స్నేహితులు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. కాగా పెళ్లి ఆగిపోవడానికి గల కారణాలు మాత్రం ఇంతవరకు తెలియరాలేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top