భల్లాల దేవుడితో రెజినా | Regina Cassandra will act with rana | Sakshi
Sakshi News home page

భల్లాల దేవుడితో రెజినా

Oct 14 2017 7:15 PM | Updated on Aug 11 2019 12:52 PM

Regina Cassandra will act with rana - Sakshi

చెన్నై : ప్రముఖ నటి రెజీనా ఓ చరిత్ర కథా చిత్రంలో నటించనున్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడిని సమర యోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ ఇతి వృత్తంతో తెరకెక్కనున్న భారీ చిత్రంలో రెజీనా ఒక కీలక పాత్రను పోషించనున్నట్లు సినీ వర్గాల్లో తాజా సమాచారం. ఇందులో సుభాష్‌ చంద్రబోస్‌ పాత్రను నటుడు రానా పోషించనున్నారు.

బాహుబలి చిత్రం తరువాత ఆయన నటించనున్న మరో చారిత్రక కథా చిత్రం ఇదే. ఈ విషయాన్ని రానా తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 1945నాటి ఘట్టంలో జరిగే కథా చిత్రంగా తెరకెక్కనున్న మరో గొప్ప కళాఖండంగా ఈ చిత్రం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఈ చిత్రంలో రానాను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించిన యువతిగా రెజీనా నటించనుందట. ఇందులో ఈమె చాలా తక్కువ మేకప్‌తో విభిన్న గెటప్‌లో కనిపించనున్నట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement