అప్పుడు... ఆ టైమ్‌లో... ఏడ్చేశా: రెజీనా | Regina Cassandra Exclusive Interview | Sakshi
Sakshi News home page

అప్పుడు... ఆ టైమ్‌లో... ఏడ్చేశా: రెజీనా

Mar 2 2016 1:39 AM | Updated on Sep 3 2017 6:46 PM

అప్పుడు... ఆ టైమ్‌లో... ఏడ్చేశా: రెజీనా

అప్పుడు... ఆ టైమ్‌లో... ఏడ్చేశా: రెజీనా

శౌర్య’ చిత్రం గురించి నాయిక రెజీనా విలేకరుల ముందు మంగళవారం మనసు విప్పింది...

 ‘శౌర్య’ చిత్రం గురించి నాయిక రెజీనా విలేకరుల ముందు మంగళవారం మనసు విప్పింది...

♦  ఏ పాత్ర చేసినా దానికి న్యాయం చేయడానికి నా వంతు కృషి  చేస్తా. గ్లామర్, డీ-గ్లామరైజ్డ్ ఏదైనా సరే చేయడానికి రెడీ. ఇందులో నా పేరు నేత్ర. నా పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి.
 
  ఇలాంటి పాత్ర చేయడం ఇదే మొదటి సారి. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర ఇది. ఓ రాజ కీయ నాయకుడి కూతుర్ని. ఒక అబ్బాయితో ప్రేమలో పడతా. అక్కడి నుంచి సినిమా అనుకోని మలుపులు తిరుగుతుంది. సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. అదేంటో సినిమాలోనే చూడాలి.

♦  మనోజ్ ఫుల్ ఎనర్జిటిక్. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తుంటారు.  దర్శకుడు దశరథ్ చాలా కూల్.

  ఈ మధ్యే మా కాలేజీలో ఫంక్షన్‌లో పాల్గొన్నా. టీచర్స్‌తో వేదిక పంచుకున్నప్పుడు ఏడ్చేశా.

నాకు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేయాలని కోరిక. లేడీ డాన్ పాత్రలు చేయాలని ఎప్పటినుంచో ఉంది. అలాంటివి అవకాశాలు వస్తే వెంటనే చేస్తాను.

Advertisement
 
Advertisement
Advertisement