రిలీజ్కు ముందే బాహుబలి రికార్డుల వేట | Record US Release for Baahubali 2 | Sakshi
Sakshi News home page

రిలీజ్కు ముందే బాహుబలి రికార్డుల వేట

Apr 15 2017 12:56 PM | Updated on Jul 14 2019 4:05 PM

రిలీజ్కు ముందే బాహుబలి రికార్డుల వేట - Sakshi

రిలీజ్కు ముందే బాహుబలి రికార్డుల వేట

ప్రస్తుతం జాతీయ స్థాయిలో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సౌత్ సినిమా బాహుబలి 2. తొలి భాగం సంచలన విజయం సాధిచటంతో సీక్వల్

ప్రస్తుతం జాతీయ స్థాయిలో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సౌత్ సినిమా బాహుబలి 2. తొలి భాగం సంచలన విజయం సాధిచటంతో సీక్వల్పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగా చిత్రయూనిట్ తొలి భాగానికి మించి ఎన్నో అద్భుతాలు ఈ సీక్వల్లో ఉన్నాయంటూ ప్రచారం చేస్తోంది. అంతేకాదు రిలీజ్ విషయంలోనూ ఇండియన్ సినిమా రికార్డ్ లన్నింటినీ చెరిపేసే దిశగా దూసుకుపోతోంది బాహుబలి.

ఈ నెల 28న రిలీజ్కు రెడీ అవుతున్న బాహుబలి 2ను ఓవర్ సీస్లో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తారు. గతంలో ఏ ఇండియన్ సినిమాకు చేయని విధంగా 1050 థియేటర్లలో బాహుబలి 2 రిలీజ్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫారిన్లో ఉన్న భారతీయులతో పాటు అక్కడి వారు కూడా బాహుబలి సినిమా చూసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే కొన్ని థియేటర్స్లో అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయాయి. అనుకున్న స్థాయిలో ఓవర్ సీస్లో బాహుబలికి థియేటర్స్ దొరికితే, తొలి రోజు కలెక్షన్ల విషయంలో బాలీవుడ్ సినిమాలకు కూడా షాక్ ఇవ్వటం కాయంగా కనిసిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement