సై రా అప్ డేట్ : రవివర్మన్ అవుట్ | Ravi Varman opts out of Chiranjeevis Sye Raa | Sakshi
Sakshi News home page

సై రా అప్ డేట్ : రవివర్మన్ అవుట్

Oct 24 2017 3:43 PM | Updated on Oct 24 2017 3:43 PM

ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, తన నెక్ట్స్ సినిమాను మరింత భారీగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సై రా నరసింహారెడ్డి సినిమాను తెరకెక్కిస్తున్నారు. మెగా తనయుడు రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఇప్పటికే టైటిల్ లోగోతో పాటు ప్రధాన పాత్రదారులు, సాంకేతిక నిపుణుల వివరాలను కూడా ప్రకటించేశారు. అయితే కొద్ది రోజులు ఈ సినిమా టెక్నిషియన్స్ ఒక్కరొక్కరుగా తప్పుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో డేట్స్ అడ్జస్ట్ కానీ కారణంగా సంగీత దర్శకుడు రెహమాన్ సై రా నుంచి తప్పుకున్నాడన్న టాక్ వినిపించింది. అయితే ఈ విషయం పై చిత్రయూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ కూడా సై రా నుంచి తప్పుకున్నారన్న టాక్ వినిపిస్తోంది.

అంతేకాదు మరో అడుగు ముందుకేసి రవివర్మన్ స్థానంలో రత్నవేలును తీసుకున్నారన్న ప్రచారం కూడా గట్టిగా వినిపిస్తోంది. శంకర్ దర్శకత్వంలో కమల్ హీరోగా తెరకెక్కబోయే భారతీయుడు 2 కోసమే రవివర్మన్.. సై రా నుంచి తప్పుకున్నారట. రత్నవేలు ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్నరంగస్థలం 1985 సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. అయితే సైరా నరసింహారెడ్డి విషయంలో సినిమాటోగ్రాఫర్ మార్పు నిజమా కాదా తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement