తీన్‌ మార్‌? | Ravi Teja Next Movie Title Kanakadurga | Sakshi
Sakshi News home page

తీన్‌ మార్‌?

Mar 23 2019 2:50 AM | Updated on Mar 23 2019 2:50 AM

Ravi Teja Next Movie Title Kanakadurga - Sakshi

కాజల్‌ అగర్వాల్‌, రవితేజ

కొత్త సినిమా కోసం రవితేజ మళ్లీ ఖాకీ డ్రెస్‌ వేసి లాఠీ చేతపట్టి పోలీస్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ తాజా చిత్రానికి ‘కందిరీగ’ ఫేమ్‌ సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ‘కనకదుర్గ’ అనే మాస్‌ టైటిల్‌ను చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తమిళంలో హిట్‌ సాధించిన విజయ్‌ ‘తేరీ’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్‌. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు ఉన్నట్లే తెలుగులోనూ ఇద్దరి హీరోయిన్స్‌ ఉన్నారు. ‘క్యాథరీన్‌’ ఒక హీరోయిన్‌గా చాన్స్‌ కొట్టేశారు.

ఇప్పుడు మరో కథానాయికగా కాజల్‌ అగర్వాల్‌ను టీమ్‌ ఎంపిక చేసిందని సమాచారం. ఇంతకుముందు ‘వీర, సారొచ్చారు’ చిత్రాల్లో రవితేజ–కాజల్‌ జంటగా నటించారు. ఇప్పుడు కొత్త సినిమాలో ‘తీన్‌’ మార్‌ స్టెప్పులేయబోతున్నారన్నమాట. ఈ చిత్రం విజయవాడ నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. రవితేజ కెరీర్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘కృష్ణ’ విజయవాడ నేపథ్యంలోనే ఉంటుందని గుర్తుండే ఉంటుంది. ఇంతకుముందు ‘విక్రమార్కుడు, మిరపకాయ్, పవర్‌’ వంటి హిట్‌ చిత్రాల్లో పోలీస్‌ పాత్రలో నటించి, మెప్పించారు రవితేజ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement