రవితేజ ‘భద్ర’ వచ్చి నేటికి 15 ఏళ్లు

Ravi Teja Bhadra Telugu Movie Completed 15 years Directed By Boyapati - Sakshi

కొన్ని సినిమాలు టీవీల్లో ఎన్ని సార్లు వచ్చినా చూస్తాం.. ఎన్నేళ్లయినా చూస్తాం. అలాంటి సినిమాల జాబితాలోకి చేరే చిత్రం ‘భద్ర’. రవితేజ హీరోగా బోయపాటి శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ తొలి చిత్రం ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన తర్వాత బోయపాటి రూపంలో టాలీవుడ్‌కు మరో మాస్‌ డైరెక్టర్‌ దొరికాడని అందరూ భావించిన ఈ చిత్రం విడుదలై నేటికి పదిహేనేళ్లవుతోంది. మాస్‌ మహారాజ్‌ రవితేజలోని ఓ విభిన్న ప్రేమికుడిని బోయపాటి తనదైన స్టైల్లో వైవిధ్యంగా చూపించాడు. ప్రేమ, త్యాగం, యాక్షన్‌, ఎమోషన్‌ ఇలా డిఫరెంట్‌ యాంగిల్స్‌లో కనిపించిన రవితేజ తన నటనతో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేశాడు. 

ఇక పాటలకు మరో ప్రధాన బలం సంగీతం. రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ అందించిన ప్రతీ పాట ఓ ఆణిముత్యమే. ‘తిరుమల వాసా తిరుమల వాస సుమధుర హాస ఈ హారతి గొనవయ్యా’, ‘ఏమైంది సారు ఏంటా హుషారు’, ‘ఓ మనసా’ ఇలా ఈ చిత్రంలోని అన్ని పాటలు ఇప్పటికీ సంగీత ప్రియుల గుండెల్లో నిలిచిపోయాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన మీరాజాస్మిన్‌ మన పక్కింటి అమ్మాయిగా కనిపించి తన నటనతో యువత డ్రీమ్‌ గర్ల్‌గా మారిపోయింది. ఇక రవితేజ, అర్జున్‌ బజ్వాల మధ్య సీన్స్‌ స్నేహితులను కట్టిపడేసేలా ఉంటాయి. ఇక ప్రకాష్‌ రాజ్‌, మురళీమోషన్‌, ఈశ్వరీ రావు తదితరులు తమ నటనతో సినిమాకు మరింత జీవం పోశారు. దిల్‌ రాజ్‌ నిర్మాత వ్యహరించిన ఈ చిత్రాన్ని తొలుత అల్లు అర్జున్‌తో తీయాలని దర్శకనిర్మాతలు భావించారు. అయితే కథ నచ్చినా కొత్త దర్శకుడు అనే కారణంతో బన్ని వెనకడుగు వేశాడు. దిల్‌ రాజ్‌ సూచనతో రవితేజను హీరో ఈ సినిమా పట్టాలెక్కించి ఘన విజయాన్ని అందుకున్నాడు బోయపాటి. 

చదవండి:
దేవిశ్రీ ఫిక్స్‌.. ప్ర‌క‌టించిన క్రేజీ డైరెక్ట‌ర్‌
శుభ‌శ్రీ జీ.. మీరు ఎంతో మందికి స్పూర్తి: చిరు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top