Raveena Tandon May Act in Yash's KGF Chapter 2 - Sakshi
Sakshi News home page

‘కేజీఎఫ్‌ 2’లో బాలీవుడ్ హీరోయిన్‌

Mar 2 2019 9:56 AM | Updated on Mar 2 2019 11:06 AM

Raveena Tandon in Talks With Yash KGF Chapter 2 - Sakshi

ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ సినిమా కేజీఎఫ్‌. కొలార్‌ గోల్డ్‌ మైన్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్‌ డ్రామాలో యష్ హీరోగా నటించాడు. ఈ సినిమా కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళ, మళయాల భాషల్లో ఒకేసారి రిలీజ్‌ అయ్యింది. అన్ని భాషల్లోనూ మంచి విజయం సాధించటంతో సీక్వల్‌పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి.

అందుకు తగ్గట్టుగా రెండవ భాగాన్ని భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే సౌత్‌ టాప్‌ స్టార్ రమ్యకృష్ణ, బాలీవుడ్ హీరో సంజయ్‌ దత్‌లను కేజీఎఫ్‌ 2 కీలక పాత్రల కోసం తీసుకున్నారు. తాజాగా ఈ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేసే పనిలో ఉన్నారట చిత్రయూనిట్. ఈ సినిమాలో మరో కీలక పాత్రకు బాలీవుడ్ సీనియర్‌ నటి రవీనా టండన్‌ను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. రవీనా కూడా ఈ సినిమాలో నటించేందుకు సుముఖంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్‌లో సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement