ర‌వీనా.. న‌న్ను పెళ్లి చేసుకుంటారా? | Raveena Tandon Funny Reply To Fan Marriage Proposal | Sakshi
Sakshi News home page

వ‌చ్చే జ‌న్మ‌లో కూడా ఖాళీ లేదు

May 7 2020 9:55 AM | Updated on May 7 2020 10:03 AM

Raveena Tandon Funny Reply To Fan Marriage Proposal - Sakshi

పలు భాష‌ల్లో న‌టిస్తూ అగ్ర‌క‌థానాయిక‌గా వెలుగొందిన న‌టి ర‌వీనా టండ‌న్. 2004లో సినిమా డిస్ట్రిబ్యూట‌ర్‌ అనిల్ థ‌డానీ ని వివాహం చేసుకున్న త‌ర్వాత ఆమె చాలా త‌క్కువ సినిమాల్లో న‌టించింది. పిల్లలు (ద‌త్త‌త తీసుకుంది), కుటుంబం అంటూ కెరీర్‌కు సరైన ప్రాధాన్య‌త‌నివ్వ‌లేదు. అయితే కొన్నాళ్ల నుంచి ఆమె తిరిగి ఫార్మాట్‌లోకి వ‌చ్చింది. వైవిధ్య‌మైన పాత్ర‌లు ఎంచుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇదిలా వుంటే అప్ప‌టికీ ఇప్ప‌టికీ ఆమెకు అభిమానులు ఏమాత్రం తగ్గ‌లేదు. "ర‌వీనా టండ‌న్ త‌న ఫ‌స్ట్ క్ర‌ష్" అని బాహుబ‌లి హీరో ప్ర‌భాస్ కూడా గ‌తంలో వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. (శానిటైజర్‌తో సీట్లను తుడిచిన స్టార్‌ నటి!)

తాజాగా ఆమె గ‌తంలో వేస‌వి కాలంలో మంచు ప్ర‌దేశాల్లో సేద తీరుతున్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ ఫొటోల‌కు మంత్ర‌ముగ్ధులైన అభిమానులు "మేడ‌మ్ సార్‌.. మేడ‌మ్ అంతే.." అంటూ కామెంట్లు పెడుతున్నారు. మ‌రో అభిమానైతే ఓ అడుగు ముందుకేసి "ర‌వీనా మేడ‌మ్‌.. వ‌చ్చే జ‌న్మ‌లో న‌న్ను పెళ్లి చేసుకుంటారా?" అని మ‌న‌సులో మాట‌ను క‌క్కేశాడు. దీనికి న‌టి స్పందిస్తూ.. "మ‌న్నించాలి, ఇప్ప‌టికే ఏడుగురికి బుక్ అయిపోయింది" అంటూ వ‌చ్చే జ‌న్మ కూడా ఖాళీగా లేద‌ని అర్థం వ‌చ్చేలా స‌ర‌దాగా స‌మాధాన‌మిచ్చింది. ఆమె చ‌మ‌త్కార శైలికి ఆశ్చ‌ర్య‌పోయిన అభిమానులు 'ఆమె ఎప్ప‌టికీ క్వీన్' అంటూ కితాబిస్తున్నారు. (ప్రభాస్‌ సీక్రెట్‌ క్రష్‌.. ఓ బాలీవుడ్‌ హీరోయిన్‌!)

Advertisement
 
Advertisement
Advertisement