రష్మిక బాలీవుడ్‌ ఎంట్రీ!

Rashmika Mandanna to Make Bollywood Debut With Jersey Remake - Sakshi

కన్నడ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన రష్మిక మందన్న, సౌత్‌లో వరుస సినిమాలతో టాప్‌ హీరోయిన్‌గా ఎదుగుతున్నారు. ప్రస్తుతం సూపర్‌ స్టార్ మహేష్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ.. కోలీవుడ్‌లోనూ విజయ్‌ సరసన నటించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ భామకు సంబంధించి మరో ఆసక్తికర వార్త మీడియా సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

ఈ భామను ఓ బాలీవుడ్‌ ఆఫర్‌ వెతుక్కుంటూ వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. తెలుగులో మంచి విజయం సాధించిన ‘జెర్సీ’ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేయనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌ ఈ రీమేక్‌ను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మికను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. తెలుగులో శ్రద్ధా శ్రీనాథ్ నటించిన పాత్రను బాలీవుడ్‌లో రష్మిక పోషించనున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top