అర్థమవుతోంది! | rashmika mandanna enter to tamil industry | Sakshi
Sakshi News home page

అర్థమవుతోంది!

Feb 4 2020 12:16 AM | Updated on Feb 4 2020 12:16 AM

rashmika mandanna enter to tamil industry - Sakshi

రష్మికా మందన్నా

‘మీకు అర్థమవుతుందా’ అంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో రష్మికా మందన్నా తెగ సందడి చేసింది. ‘ఛలో’తో తెలుగు తెరపై కనిపించినప్పుడే ఈ కన్నడ బ్యూటీ ఇక్కడ టాప్‌ హీరోయిన్లలో ఒకటి అవుతుందని చాలామందికి అర్థమైంది. గీత గోవిందం, దేవదాస్, డియర్‌ కామ్రేడ్‌.. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ మహేశ్‌తో చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’తో టాప్‌ లీగ్‌లోకి వెళ్లిపోయింది రష్మికా. నెక్ట్స్‌ అల్లు అర్జున్‌ సరసన కూడా సినిమా చేయబోతోంది. ప్రస్తుతం నితిన్‌తో ‘భీష్మ’ సినిమాలో నటిస్తోంది.

ఇలా తెలుగులో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న రష్మికా ఈ ఏడాది తమిళ తెరకు కూడా పరిచయం కాబోతోంది. కార్తీ సరసన ‘సుల్తాన్‌’ అనే సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే సూర్య సరసన ఓ సినిమాలో నటించే చాన్స్‌ కొట్టేసిందని టాక్‌. సూర్యతో ‘సింగమ్‌’ వంటి హిట్‌ సిరీస్‌ తీసిన హరి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో రష్మికా నటించనుందట. ఇటు తెలుగులో స్టార్‌ హీరోలతో చేస్తూ దూసుకెళుతోన్న రష్మికా అటు తమిళంలోనూ ఆ దూకుడు మీదే ఉన్నారని అర్థమవుతోంది కదూ.

Advertisement
 
Advertisement
Advertisement