రాంగ్‌ స్టెప్‌! | Sakshi
Sakshi News home page

రాంగ్‌ స్టెప్‌!

Published Mon, Oct 23 2017 12:42 AM

rashi khanna dance instructor role in touch chesi chudu

వెస్ట్రన్‌ మాస్‌ డ్యాన్స్‌తో మ్యూజిక్‌ క్లాస్‌ చాలా జోరుగా సాగుతోంది. సడన్‌గా ఓ రాంగ్‌ స్టెప్‌ పడింది. అంతే...హీరోయిన్‌ రాశీ ఖన్నా చూపు అటు పడింది. రాంగ్‌ స్టెప్‌ను కరెక్ట్‌ చేశారు. ‘ఇలా చేయాలి’ అని చెప్పడం కాదు.. స్టెప్‌ వేసి, చూపించారు. ఇలా రాంగ్‌ స్టెప్స్‌ను కరెక్ట్‌ చేస్తూ రైట్‌ స్టెప్స్‌ నేర్పిస్తున్నారామె.

రాశీ ఖన్నా ఏదైనా మ్యూజిక్‌ స్కూల్లో డ్యాన్స్‌ టీచర్‌గా చేరారేమో అనుకుంటున్నారా? చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి అంత తీరిక ఏది? మరి... రాంగ్‌ స్టెప్స్‌ని కరెక్ట్‌ చేసింది ఎక్కడ? అంటే ‘టచ్‌ చేసి చూడు’ సినిమా లొకేషన్లో. రవితేజ హీరోగా విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రాశీ ఖన్నా డ్యాన్స్‌ ఇన్‌స్ట్రక్టర్‌ రోల్‌ చేస్తున్నారు. అసలు విషయం అదన్న మాట.

Advertisement

తప్పక చదవండి

Advertisement