చిరంజీవిగారి అభినందన మరచిపోలేను | Ranjith- Juvva is a typical masala entertainer | | Sakshi
Sakshi News home page

చిరంజీవిగారి అభినందన మరచిపోలేను

Feb 22 2018 12:12 AM | Updated on Feb 22 2018 12:13 AM

Ranjith- Juvva is a typical masala entertainer | - Sakshi

రంజిత్‌

‘‘నాది వైజాగ్‌. చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. నన్ను నేను హీరోగా చూసుకోవాలనేది నా కోరిక. అందుకు చాలాకాలం ట్రై చేశా’’ అని హీరో రంజిత్‌ అన్నారు. రంజిత్, పాలక్‌ లల్వాని జంటగా ‘దిక్కులు చూడకు రామయ్య’ ఫేమ్‌ త్రికోటి పి. దర్శకత్వంలో భరత్‌ సోమి నిర్మించిన ‘జువ్వ’ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా రంజిత్‌ మాట్లాడుతూ– ‘‘నా మొదటి చిత్రం ‘నువ్వు నేను ఒకటవుదాం’. రెండో సినిమా ‘జువ్వ’ని మా అన్నయ్య డా. భరత్‌  చాలా ఇష్టపడి నిర్మించారు. ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి ఆయనే ప్రధాన కారణం. ఇదొక అవుట్‌ అండ్‌ అవుట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌.

రొమాన్స్, యాక్షన్, మంచి పాటలు, ఫన్‌ అన్నీ ఉంటాయి. ఇందులో నా పాత్ర పేరు రానా. ఎప్పుడూ జాలీగా, సరదాగా ఉండే కుర్రాడి పాత్ర. ఫైట్స్, రొమాన్స్, ఫన్‌.. ఇలా అన్ని సమయాల్లోనూ జాలీగానే ఉండే క్యారెక్టర్‌. త్రికోటిగారికి నాలెడ్జ్‌ ఎక్కువ. షూటింగ్‌ సమయంలో ఆయన వద్ద నుంచి చాలా నేర్చుకున్నాను. కీరవాణిగారు వంటి పెద్ద సంగీత దర్శకుడు నా సినిమాకు మ్యూజిక్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. చిరంజీవిగారు అడగ్గానే టీజర్‌ రిలీజ్‌ చేసి, ‘నీది ఫొటోజెనిక్‌ ఫేస్‌’ అని మెచ్చుకున్నారు. ఆయన అభినందన మరచిపోలేను. ఫ్రెష్‌ లవ్‌స్టోరీ, స్పోర్ట్ప్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీస్‌లో నటించాలని ఉంది. నెక్ట్స్‌ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement