వారణాసి కౌంట్‌డౌన్‌ ప్రారంభం.. కీరవాణి పోస్ట్‌ | Varanasi Movie Release Schedule Countdown Start | Sakshi
Sakshi News home page

వారణాసి కౌంట్‌డౌన్‌ ప్రారంభం.. కీరవాణి పోస్ట్‌

Apr 7 2026 1:40 PM | Updated on Apr 7 2026 2:26 PM

Varanasi Movie Release Schedule Countdown Start

మహేశ్‌బాబు- దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో ప్రతిష్ఠాత్మకంగా రానున్న చిత్రం ‘వారణాసి’. భారీ బడ్జెట్‌తో కేఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమా కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది అని సంగీత దర్శకుడు కీరవాణి '365' నంబర్‌తో మెసేజ్‌ ద్వారా తెలిపారు. అంటే ఈ మూవీ వచ్చే ఏడాది సరిగ్గా ఇదే రోజు ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. ఇందులో  ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  వారణాసిలో రుద్ర, శ్రీరాముడిగా మహేశ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నటం విశేషం.

2027 ఏప్రిల్ 7న వారణాసి విడుదల కానుందని చిత్ర యూనిట్‌ చాలా రోజుల క్రితమే ప్రకటించింది. అయితే, 'ధురందర్' ఫ్రాంచైజీ భారీ విజయం సాధించిన తర్వాత, రాజమౌళి కూడా 'వారణాసి'ని రెండు భాగాలుగా విభజించి, విడుదల ప్రణాళికను సవరించవచ్చని ఇటీవల వదంతులు వచ్చాయి. అయితే, ఇప్పుడు కీరవాణి చేసిన కౌంట్‌డౌన్‌ కామెంట్‌తో అనుకున్న సమయానికే వారణాసి విడుదల కానుందని క్లారిటీ వచ్చేసింది. ఆ పోస్ట్, వారణాసి చిత్రం కనీసం ప్రస్తుతానికి ఒకే భాగం (సింగిల్-పార్ట్)గా రాబోతోందని కూడా ధృవీకరిస్తున్నట్లు కనిపిస్తోంది. విడుదలకు సరిగ్గా 365 రోజులు మిగిలి ఉండటంతో, ఇటీవలి కాలంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో ఒకటైన ఈ ప్రాజెక్ట్‌కు కౌంట్‌డౌన్ అధికారికంగా ప్రారంభమైంది.
 

Advertisement
 
Advertisement
Advertisement