breaking news
vaaranasi
-
కాసుల వర్షం కురిపిస్తున్న ‘అడవి’.. స్టార్ హీరోల చూపులన్నీ అటువైవే!
టాలీవుడ్లో ఒకప్పుడు ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ స్టోరీల హవా నడిచేది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు లవ్‌స్టోరీ, కామెడీ ఎంటర్టైన్మెంట్ రాజ్యమేలాయి. ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. మన స్టార్ హీరోలంతా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ స్టోరీలపై ఆసక్తి చూపిస్తున్నారు. పిరియాడిక్, హిస్టారికల్ చిత్రాలలో యాక్షన్ సన్నివేశాలను ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అవి బాగా వర్కౌట్ అవుతున్నాయి. అడవి నేపథ్యంలో వచ్చిన కాంతార 1&2 బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన పుష్ప ఎన్ని రికార్డులను క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురమ్ భీమ్ ఎపిసోడ్‌తో పాటు అల్లూరీ యాక్షన్ సీన్ అడవి నేపథ్యంలోనే ఉంటుంది. ఆ సన్నివేశాలన్నీ సినిమా విజయం కీలక పాత్ర పోషించాయి. ఇలా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన కథలన్నీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుండడంతో .. మరికొంత మంది స్టార్ హీరోలు కూడా అడవి నేపథ్యం కథలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.అందులో అతిపెద్ద సినిమా ‘వారణాసి’. మహేశ్ బాబు-రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేశ్ మూడు గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలన్నీ అడవి నేపథ్యంలోనే సాగుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది.అక్కినేని హీరో నాగచైతన్య కూడా అడవి బాటనే పట్టారు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘వృషకర్మ’. విరూపాక్ష’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ అడ్వెంచరస్ అండ్ మైథలాజికల్ యాక్షన్ డ్రామాలోని కీలక సీన్లన్ని అడవి నేపథ్యంలోనే తెరకెక్కస్తున్నారట. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది.ఇక మేగా మేనల్లుడు సాయి దుర్గతేజ్ కూడా అడవినే నమ్ముకున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ కథ మొత్తం అడవి నేపథ్యంలోనే ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతుది.ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘ఎన్టీఆర్‌నీల్’ (వర్కింగ్ టైటిల్) కథ కూడా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లోనే సాగుతుందట. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఓ యాక్షన్ సీన్ ఈ సినిమాకే హైలెట్ అవుతుందట. శ్రీవిష్ణు టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘కామ్రేడ్ కల్యాణ్’, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘హైందవ’ చిత్రాల్లో కూడా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాపే హైలెట్ కానుందనే టాక్ వినిపిస్తోంది. -
అమరావతిలో వారణాశి విద్యార్థులు
అమరావతి: ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన అమరావతిని సోమవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాశి విశ్వవిద్యాలయ విద్యార్థులు సందర్శించారు. వీరు తొలుత అమరావతి పాత మ్యూజియంలోని మహాస్థూపం వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కొత్త మ్యూజియంలోని శిల్పాలను, ధ్యానబుద్ధ విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తాము భౌద్దం అధ్యయనం చేయటానికి అమరావతి, భట్టిప్రోలు, నాగార్జునసాగర్, ఘంటసాల తదితర భౌద్ధారామాలను సందర్శిస్తున్నామని విద్యార్థులు తెలిపారు.


