తాప్సీపై విరుచుకుపడిన కంగన సోదరి

Rangoli Chandel Questions Taapsee Pannu For What We Should Praise You - Sakshi

బాలీవుడ్‌లో హీరోయిన్‌ తాప్సీ, కంగన సోదరి రంగోలి మధ్య రాజుకున్న మాటల యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. తాజాగా తాప్సీ కంగనను ఉద్దేశిస్తూ.. ‘ఓ మహిళ మరో మహిళకు మద్దతుగా ఉండాలని కంగన ఎప్పుడూ చెబుతుంటుంది. మరి ఆమె నా ‘మిషన్‌ మంగళ్‌’ సినిమాను అభినందించినట్లు నాకు తెలియలేదు. ఈ సినిమాలో ఐదుగురం ఆడవాళ్లం ఉన్నాము. మరి ఆమె మమ్మల్ని మెచ్చుకుందా’ అంటూ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తాప్సీ వ్యాఖ్యలపై కంగన సోదరి రంగోలి తీవ్రంగా మండి పడ్డారు.

ఈ మేరకు రంగోలి ట్విటర్‌లో.. ‘ప్రతి రోజు కంగనను విమర్శిస్తున్నావ్‌.. అసలు నిన్ను ఎందుకు మెచ్చుకోవాలి. ఇంత వరకూ నువ్వు ఏం సాధించావ్‌. అక్షయ్‌, విద్యాబాలన్‌లు ఉన్న సినిమాలో ఓ రెండు నిమిషాల పాత్ర, అమితాబ్‌ బచ్చన్‌ సినిమాలో ఓ పాత్ర చేసినందుకు నిన్ను మెచ్చుకోవాలా. సినిమా అంతా ఒకే రకమైన హావభావాలు వ్యక్తం చేసే నిన్ను ఏ విషయంలో పొగడాలి. విలేకరులు నిన్ను పిలిచింది కంగన గురించి ప్రశ్నించడానికి కానీ.. నీ పనిని, గొప్పతనాన్ని పొగడటానికి కాదు. నా ప్రశ్నలకు సిల్లీగా కాకుండా హుందగా స్పందిచగల్గితే.. స్పందించు.. లేదా వదిలేయ్‌’ అంటూ తాప్పీని విమర్శిస్తూ రంగోలి ట్వీట్‌ చేశారు. మరి ఈ వ్యాఖ్యలపై తాప్సీ ఎలా స్పందిస్తారో చూడాలి.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top