డబుల్‌ ధమాకా? | Ranbir Kapoor to play a double role in his next Shamshera | Sakshi
Sakshi News home page

డబుల్‌ ధమాకా?

Mar 27 2019 12:27 AM | Updated on Mar 27 2019 12:27 AM

Ranbir Kapoor to play a double role in his next Shamshera - Sakshi

రణ్‌బీర్‌ కపూర్, సంజయ్‌ దత్, వాణీ కపూర్‌ ముఖ్యతారలుగా రూపొందుతున్న హిందీ చిత్రం ‘షంషేరా’. ఆదిత్యాచోప్రా నిర్మిస్తున్నారు. బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా అడవిలో ఉన్న ఓ తెగ ఏ విధంగా పోరాటం చేసిందనే నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఇందులో బందిపోటు పాత్రలో నటిస్తున్నారు రణ్‌బీర్‌కపూర్‌. డబుల్‌ యాక్షన్‌... అంటే తండ్రీకొడుకుల పాత్రల్లో నటిస్తున్నారట రణ్‌బీర్‌.

ఇప్పటివరకూ  ఏ సినిమాలోనూ రణ్‌బీర్‌ ద్విపాత్రాభినయం చేయలేదట. మరి.. ప్రచారంలో ఉన్నట్లుగా రణ్‌బీర్‌ రెండు పాత్రలు చేస్తున్నారా? లేదా అనేది వచ్చే ఏడాది జూలైలో తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్‌ అప్పుడే. ఇక ఈ సినిమా కాకుండా పీరియాడికల్‌ మూవీ ‘బ్రహ్మాస్త్ర’లో నటిస్తున్నారు రణ్‌బీర్‌. వ్యక్తిగత విషయాని కొస్తే.. బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌తో రణ్‌బీర్‌ ప్రేమలో ఉన్నారని తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement