ఆ హీరో నటన అదుర్స్‌: ఆమీర్‌ | Ranbir is the best actor: Aamir | Sakshi
Sakshi News home page

ఆ హీరో నటన అదుర్స్‌: ఆమీర్‌

Oct 30 2016 8:12 PM | Updated on Sep 4 2017 6:46 PM

ఏ దిల్‌ హై ముష‍్కిల్‌ సినిమాలో యువ హీరో రణబీర్‌ కపూర్‌ నటన బాగుందని బాలీవుడ్‌ స్టార్‌ ఆమీర్‌ ఖాన్‌ ప్రశంసించాడు.

ముంబై: ఏ దిల్‌ హై ముష‍్కిల్‌ సినిమాలో యువ హీరో రణబీర్‌ కపూర్‌ నటన బాగుందని బాలీవుడ్‌ స్టార్‌ ఆమీర్‌ ఖాన్‌ ప్రశంసించాడు. దర్శకుడు కరణ్‌ జోహార్‌ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడని ట్వీట్‌ చేశాడు. 
 
‘ఏ దిల్‌ హై ముష్కిల్‌ సినిమాను చూశా. నాకు చాలా బాగా నచ్చింది. బంతి స్టేడియం దాటిపోయేలా కరణ్‌ కొట్టాడు. రణబీర్‌, ఐశ్వర్య, అనుష్క నటన బాగుంది. రణబీర్‌ బెస్ట్‌ యాక్టర్‌’ అంటూ ఆమీర్‌ ట్వీట్‌ చేశాడు. ఈ సినిమాలో రణబీర్‌తో పాటు ఐశ్వర్యా రాయ్‌, అనుష్క శర్మ, పాకిస్థాన్‌ నటుడు ఫవాద్‌ ఖాన్‌ నటించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధిస్తోంది. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement