ఆ సినిమా రానా చేయాల్సిందట..! | Rana refused to act in Bichagadu Remake | Sakshi
Sakshi News home page

ఆ సినిమా రానా చేయాల్సిందట..!

Jun 11 2016 9:56 AM | Updated on Aug 11 2019 12:52 PM

ఆ సినిమా రానా చేయాల్సిందట..! - Sakshi

ఆ సినిమా రానా చేయాల్సిందట..!

సర్దార్ గబ్బర్సింగ్, బ్రహ్మోత్సవం లాంటి భారీ చిత్రాలు కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సమయంలో డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అయి తెలుగునాట సంచలన విజయం సాధించిన సినిమా బిచ్చగాడు.

సర్దార్ గబ్బర్సింగ్, బ్రహ్మోత్సవం లాంటి భారీ చిత్రాలు కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సమయంలో డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అయి తెలుగునాట సంచలన విజయం సాధించిన సినిమా బిచ్చగాడు. తమిళ హీరో విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా పబ్లిసిటీ లేకపోయినా కేవలం మౌత్ టాక్ తోనే మంచి వసూళ్లను సాధించింది.

అయితే తమిళ్లో తెరకెక్కిన ఈ సినిమాను ముందు తెలుగులో రానా హీరోగా రీమేక్ చేయాలని భావించారు. అయితే సినిమా చూసిన రానా, తన ఇమేజ్కు, ఫిజిక్కు ఈ పాత్ర సరిపోదని భావించి నో చెప్పేశాడు. దీంతో తమిళ నిర్మాతలు అదే సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ డబ్బింగ్ సినిమానే తెలుగు స్ట్రయిట్ సినిమాలకు ధీటుగా వసూళ్లను సాధిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement