తేజ దర్శకత్వంలో రానా | Rana next movie with director teja | Sakshi
Sakshi News home page

తేజ దర్శకత్వంలో రానా

May 10 2016 9:37 PM | Updated on Aug 11 2019 12:52 PM

తేజ దర్శకత్వంలో రానా - Sakshi

తేజ దర్శకత్వంలో రానా

వారసులుగా ఎంట్రీ ఇచ్చిన యువ కథానాయకులు స్టార్ ఇమేజ్ కోసం పోటీ పడుతుంటే యంగ్ హీరో రానా మాత్రం విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్నాడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో అతిథి...

వారసులుగా ఎంట్రీ ఇచ్చిన యువ కథానాయకులు స్టార్ ఇమేజ్ కోసం పోటీ పడుతుంటే యంగ్ హీరో రానా మాత్రం విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్నాడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో అతిథి పాత్రల్లో నటిస్తూ తన మార్క్ చూపిస్తున్నాడు. బాహుబలి సినిమాలో ప్రతినాయక పాత్రలో నటించిన రానా ఒక్కసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్న రానా ఓ రిస్కీ ప్రాజెక్ట్ ను ఓకె చేశాడు.

చిత్రం, నువ్వు నేను, జయం లాంటి సినిమాలతో ఇండస్ట్రీని మలుపు తిప్పిన దర్శకుడు తేజ, తరువాత ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలతో కలిసి చేసిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఆలోచనలో పడ్డాడు. కొద్ది రోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఇటీవల రాజశేఖర్ ప్రధాన పాత్రలో అహం సినిమాను ప్రారంభించాలని ప్రయత్నించాడు. అయితే ఈ సినిమా ఇప్పటికీ చర్చల దశలోనే ఉంది.

అహం సినిమా పట్టాలెక్కక ముందే రానా హీరోగా మరో సినిమాను ప్రారంభిస్తున్నాడు తేజ. ఈ విషయాన్ని రానా స్వయంగా తన ట్విట్టర్ లో ప్రకటించాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ వారంలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి చాలా రోజులుగా అహం సినిమా కోసం ఎదురుచూస్తున్న రాజశేఖర్ ఈ వార్త పై ఎలా స్పందిస్తాడో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement