బాహుబలి రిలీజ్పై రానా క్లారిటీ | Rana clears major confusion on baahubali, robo clash | Sakshi
Sakshi News home page

బాహుబలి రిలీజ్పై రానా క్లారిటీ

Jun 30 2016 2:08 PM | Updated on Aug 11 2019 12:52 PM

బాహుబలి రిలీజ్పై రానా క్లారిటీ - Sakshi

బాహుబలి రిలీజ్పై రానా క్లారిటీ

ఇండియాన్ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి చేర్చే రెండు భారీ చిత్రాలు ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో రూపొందుతున్నాయి. అంతేకాదు ఈ రెండు సినిమాలు ఇప్పటికే ఘనవిజయం సాధించిన చిత్రాలకు...

ఇండియాన్ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి చేర్చే రెండు భారీ చిత్రాలు ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో రూపొందుతున్నాయి. అంతేకాదు ఈ రెండు సినిమాలు ఇప్పటికే ఘనవిజయం సాధించిన చిత్రాలకు సీక్వల్గా తెరకెక్కటం మరో విశేషం. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమాకు సీక్వల్గా బాహుబలి 2 రూపొందుతుండగా, క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో రోబో 2 మరింత భారీగా తెరకెక్కుతోంది.

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతాయన్న వార్త కొద్ది రోజులుగా ఇండస్ట్రీ సర్కిల్స్లో వినిపిస్తోంది. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఇంతటి భారీ చిత్రాలు ఒకేసారి రిలీజ్ అయితే కలెక్షన్ల మీద తీవ్ర ప్రభావం ఉంటుందని భావించారు. అయితే ఈ వార్తలపై బాహుబలి నటుడు రానా క్లారిటీ ఇచ్చేశాడు.

ఇంతటి భారీ చిత్రాలు ఒకేసారి రిలీజ్ కావటం అసాధ్యం , అయినా ఈ రెండు చిత్రాలకు ఇంకా షూటింగ్తో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా జరగాల్సి ఉంది. ఇప్పుడే ఆ సినిమాల రిలీజ్ గురించి చెప్పలేం. అయినా ఎట్టి పరిస్థితుల్లో ఈ భారీ చిత్రాలు ఒకే రిలీజ్ అవ్వవు.., అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం సింగపూర్ జరుగుతున్న సైమా అవార్డ్స్లో పాల్గొంటున్న రానా మీడియాతో బాహుబలి రిలీజ్పై క్లారిటీ ఇచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement