కథే వారిని ఎంచుకుంది : రానా | Rana and Manchu Lakshmi praises Ninnu Kori | Sakshi
Sakshi News home page

కథే వారిని ఎంచుకుంది : రానా

Jul 6 2017 1:27 PM | Updated on Aug 11 2019 12:52 PM

కథే వారిని ఎంచుకుంది : రానా - Sakshi

కథే వారిని ఎంచుకుంది : రానా

ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న నిన్ను కోరి సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి

ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న నిన్ను కోరి సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి లాంటి స్టార్స్ సినిమా కోసం ఎదురుచూస్తున్నామంటూ ప్రకటించటంతో నిన్నుకోరిపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా సినీ ప్రముఖుల కోసం వేసిన ప్రత్యేక షో చూసిన రానా.. చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించాడు.

'అద్భుతమైన నటులు కలిగిన గొప్ప సినిమా చూశాను. అలాంటి గొప్ప నటులున్న సమయంలో నేను సినీ రంగంలో ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా.. దర్శకుడు మంచి సినిమా కోసం ఈ కథను ఎంచుకోలేదు.. ఆ కథే ఈ యూనిట్ ను ఎంచుకుంది. నివేదా.. ఇటీవల తెలుగు సినిమా వెతికి పట్టుకున్న గొప్ప నటివి నువ్వు' అంటూ ట్వీట్ చేశాడు రానా. రానాతో పాటు సినిమా చూసిన మంచు లక్ష్మీ, మనోజ్లు కూడా నాని, ఆది, నివేదా థామస్ల నటనపై ప్రశంసలు కురిపించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement