కత్తి ఖరారు! | ramcharan confirmed to chiranjeevi 150th movie remake to kathi | Sakshi
Sakshi News home page

కత్తి ఖరారు!

Dec 14 2015 11:54 PM | Updated on Sep 3 2017 1:59 PM

కత్తి ఖరారు!

కత్తి ఖరారు!

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు?

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు? ఇండస్ట్రీలో ఇదొక మిలియన్ డాలర్ క్వశ్చన్. ఎట్టకేలకు ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. బెంగళూరు సాక్షిగా 150వ సినిమాకి సంబంధించిన వార్తను రామ్‌చరణ్ అధికారికంగా ప్రకటించారు. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తరువాత జరిగిన ఓ అవార్డు వేడుకలో తన తండ్రి చేయనున్న చిత్రం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు చరణ్. తమిళ చిత్రం ‘కత్తి’ రీమేక్‌లో తన తండ్రి నటిస్తారనీ, వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తారనీ చరణ్ పేర్కొన్నారు. సంక్రాంతికి పూర్తి వివరాలు ప్రకటిస్తామని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement