'రామయ్యా వస్తావయ్యా' తొలిరోజు షేర్ రూ. 8.7 కోట్లు | 'Ramayya Vasthavayya' collects Rs.8.7 crore on first day | Sakshi
Sakshi News home page

'రామయ్యా వస్తావయ్యా' తొలిరోజు షేర్ రూ. 8.7 కోట్లు

Oct 13 2013 11:35 AM | Updated on Sep 1 2017 11:38 PM

'రామయ్యా వస్తావయ్యా' తొలిరోజు షేర్ రూ. 8.7 కోట్లు

'రామయ్యా వస్తావయ్యా' తొలిరోజు షేర్ రూ. 8.7 కోట్లు

జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'రామయ్యా వస్తావయ్యా' సినిమాపై భిన్నమైన టాక్ వచ్చినా ఆశించిన స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టింది.

జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'రామయ్యా వస్తావయ్యా' సినిమాపై భిన్నమైన టాక్ వచ్చినా ఆశించిన స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మొదటి రోజు 8.7 కోట్లు వసూలు చేసింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 40 కోట్ల రూపాయల వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. సమంత, శృతిహాసన్ హీరోయిన్లు కాగా హరీష్ శంకర్ దర్శకుడు.

'రామయ్యా వస్తావయ్యా సినిమాపై మిశ్రమ స్పందన వచ్చినా ఆంధ్రప్రదేశ్లో మంచి వసూళ్లు రాబట్టింది. తొలి రోజే భారీ మొత్తం వచ్చింది. అయితే తర్వాతి రోజు నుంచి వసూళ్లు తగ్గాయి. తొలి వారం కలెక్షన్లను బట్టి బాక్సాఫీసు వద్ద ఈ సినిమా సత్తా ఎంత అన్న విషయం తేలనుంది' అని సినీ విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement