RGV Touches Actress Naina Ganguly Feet at Beautiful Movie Team Pre New Year Party - Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ కాళ్లపై పడ్డ రామ్‌గోపాల్‌ వర్మ

Dec 30 2019 12:04 PM | Updated on Dec 30 2019 3:36 PM

Ram Gopal Varma Touches Heroine Naina Ganguly Feet - Sakshi

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఎప్పుడు ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. తన సినిమాలను వినూత్న ప్రచారం ద్వారా జనాల్లోకి తీసుకెళ్లడం ఆర్జీవీకే చెల్లింది. ఇటీవల బ్యూటీఫుల్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆ చిత్ర హీరోయిన్‌ నైనా గంగూలీతో కలిసి స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్జీవీ నైనా కాళ్లు పట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. ఆర్జీవీ శిష్యుడు అగస్త్య మంజు తెరకెక్కించిన తాజా చిత్రం బ్యూటీఫుల్‌. ‘ట్రిబ్యూట్‌ టు రంగీలా’అనేది ఈ సినిమా క్యాప్షన్‌. అయితే ఆర్జీవీ ఈ చిత్రానికి కథ సమకూర్చాడు.

జనవరి 1న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ కూడా జోరుగా సాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం వోడ్కా విత్‌ వర్మ పేరిట.. బ్యూటిఫుల్‌ టీమ్‌ ప్రీ న్యూ ఇయర్‌ ప్రైవేటు పార్టీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బ్యూటీఫుల్‌ చిత్రబృందంతో కలిసి ఆర్జీవీ చిందులేశారు. పార్టీ చివర్లో నైనాతో కలిసి డ్యాన్స్‌ చేసిన ఆర్జీవీ ఆమె కాళ్లమీద పడ్డారు. దీంతో షాక్‌ అయిన నైనా.. ఒక్కసారిగా కింద కూర్చుండిపోయారు. అనంతరం ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement