పవన్ అభిమానులకు వర్మ క్షమాపణలు | Ram Gopal Varma shocks Pawan Kalyan Fans | Sakshi
Sakshi News home page

పవన్ అభిమానులకు వర్మ క్షమాపణలు

Apr 12 2017 9:57 AM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ అభిమానులకు వర్మ క్షమాపణలు - Sakshi

పవన్ అభిమానులకు వర్మ క్షమాపణలు

ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో న్యూస్ లో ఉండే రామ్ గోపాల్ వర్మ గత రాత్రి తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. ప్రతీ

ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో న్యూస్ లో ఉండే రామ్ గోపాల్ వర్మ గత రాత్రి తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. ప్రతీ సందర్భాన్ని వివాదాస్పదం చేస్తూ తన వ్యాఖ్యలతో స్టార్ హీరోల అభిమానులను ఇబ్బంది పెట్టడమే కాదు. కొంత మంది నమ్మకాలను కూడా వెక్కింరించే వర్మ ఇప్పుడు మనసు మార్చుకున్నాడట. ఇక మీదట ఎవరినీ కించపరిచేలా వ్యాఖ్యలు చేయబోనని ఒట్లు కూడా వేశాడు.

అంతేకాదు 'నేను దేవుణ్ని నమ్మను కాబట్టి నా మాటలు మీరు నమ్మకపోవచ్చు అందుకే ఈసారి మా అమ్మ మీద, దర్శకుడు స్పీల్ బర్గ్ మీద బాలీవుడ్ మెగాస్టార్ సీనియర్ బచ్చన్ మీద ఒట్టేసి చెపుతున్నా' అంటూ ట్వీట్ చేశాడు. ఇటీవల విద్యుత్ జమాల్, టైగర్ ష్రాఫ్ ల మార్షల్ ఆర్ట్స్ ను పోలుస్తూ వర్మ కొన్ని ట్వీట్లు చేశాడు. అయితే ట్వీట్లపై స్పందించిన విద్యుత్ జమాల్, షావోలిన్ మాంక్ స్టైల్ ను మర్చిపోయి, రామ్ గోపాల్ వర్మ డ్రంకెన్ మాస్టర్ స్టైల్ ను ట్రై చేయండి అంటూ కౌంటర్ ఇచ్చాడు.

విద్యుత్ ట్వీట్ తరువాత వర్మ 'నేను మారిపోయాను ఇక ఎవరి మీద వివాదాస్పద ట్వీట్లు చేయను, నన్ను నమ్మండి. నా వల్ల ఇబ్బంది పడ్డవాళ్లంతా నన్ను క్షమించండి' అంటూ ట్వీట్ చేశాడు. అయితే చేసి ఈ ట్వీట్లను కూడా ఎవరూ సీరియస్ గా తీసుకోవటం లేదు. గతంలోనూ ఇలాగే ఇక మెగా ఫ్యామిలీ పై ట్వీట్లు చేయనూ అంటూ ప్రకటించి, తిరిగి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశాడు వర్మ.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement