ఇది నా కెరీర్‌లోనే ప్రతిష్టాత్మక సినిమా: వర్మ | Ram Gopal Varma New Film Enter The Girl Dragon, Teaser Today | Sakshi
Sakshi News home page

ఇది నా కెరీర్‌లోనే ప్రతిష్టాత్మక సినిమా: వర్మ

Nov 27 2019 11:36 AM | Updated on Nov 27 2019 11:40 AM

Ram Gopal Varma New Film Enter The Girl Dragon, Teaser Today - Sakshi

నిత్యం వివాదాలు, వరుస సినిమాలతో నిరంతరం వార్తల్లో ఉండే దర్శకుడు రాంగోపాల్‌ వర్మ. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌, కమ్మరాజ్యంలో కడపరెడ్లు వంటి సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపుతున్న వర్మ తాజాగా మరో సినిమాను ప్రకటించాడు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ‘ఎంటర్‌ ద గర్ల్‌ డ్రాగన్‌’ సినిమాను తెరపైకి తెచ్చాడు. ఇది భారతదేశంలో నిర్మించిన తొలి మార్షల్‌ ఆర్ట్స్‌ చిత్రమని, తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ సినిమా టీజర్‌ను బ్రూస్‌లీ 80వ జయంతి సందర్భంగా బుధవారం మధ్యాహ్నం 3.12 గంటలకు విడుదల చేయబోతున్నట్టు వర్మ ట్విటర్‌లో వెల్లడించాడు.

ఇండో-చైనా సంయుక్త ప్రోడక్షన్‌లో ఈ సినిమా నిర్మితమవుతుందని తెలిపిన వర్మ.. చైనీస్‌ నిర్మాతతో ఒప్పందంపై సంతకం చేస్తున్న ఫొటోను కూడా ట్విటర్‌లో పోస్టు చేశారు. ఈ సినిమా అంతర్జాతీయ ట్రైలర్‌ను బ్రూస్‌ లీ సొంత పట్టణమైన చైనాలోని ఫోషన్‌ సిటీలో డిసెంబర్‌ 13న విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇక నేడు (బుధవారం) బ్రూస్‌ లీ జయంతి కావడంతో ఆయన పట్ల తన ప్రేమను, ఆరాధనను చాటుతూ రాంగోపాల్‌ వర్మ ఫేస్‌బుక్‌లో ఒక నోట్‌ పోస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement