శ్రీదేవీ జీవితంపై వర్మ సినిమా? | Ram Gopal Varma To Make A Movie On The Life Of Sridevi? | Sakshi
Sakshi News home page

శ్రీదేవీ జీవితంపై వర్మ సినిమా?

Mar 2 2018 8:12 PM | Updated on Aug 13 2018 4:22 PM

Ram Gopal Varma To Make A Movie On The Life Of Sridevi? - Sakshi

శ్రీదేవీ, వర్మ (ఫైల్‌ ఫోటో)

ముంబై : అనంత‌లోకాల‌కి వెళ్ళిన అందాల తార శ్రీదేవి మ‌ర‌ణాన్ని సంచ‌ల‌న ద‌ర్శకుడు రామ్ గోపాల్ వ‌ర్మ అసలు తట్టుకోలేకపోతున్నారు. శ్రీదేవీ మరణించిందన్న విషయం తెలిసిన దగ్గర్నుంచి వర్మ బాధ వర్ణనాతీతం. సముద్రమంత ప్రేమను కురిపిస్తున్న అభిమానుల కోసమైనా దేవుడు తన మనసును మార్చుకుని ఆమెని వెనక్కి పంపాలంటూ పలు ట్వీట్స్‌ సైతం చేశారు. శ్రీదేవీ జీవితం గురించి ఎవరికీ తెలియని విషయాలంటూ అభిమానులకు ఓ ప్రేమ లేఖ కూడా రాశాడు. ఇప్పుడిక శ్రీదేవీ జీవితంపై సినిమా తీయాలని నిర్ణయించారట. 

శ్రీదేవీ జీవితం రామ్‌ గోపాల్‌ వర్మ సినిమా తీయబోతున్నారంటూ.. ఆయనకు అత్యంత సన్నిహితుడు, గీత రచయిత సిరశ్రీ ఓ టీవీ ఛానల్‌ ప్రొగ్రామ్‌లో చెప్పినట్టు తెలుస్తోంది. స్టోరీ తుది రూపం దాల్చగానే, ఈ బయోపిక్‌పై వర్మ అధికారిక ప్రకటన చేస్తారంటూ సిరశ్రీ చెప్పినట్టు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఆర్‌జీవీ నుంచి దీనిపై ఎలాంటి ప్రకటనలు రాలేదు. అయితే రామ్‌ గోపాల్‌ వర్మ, శ్రీదేవీ జీవితంపై సినిమా తీయబోతున్నాడంటూ వార్తలు హల్‌ చల్‌ చేస్తున్న క్రమంలో, ఆయన ఈ సినిమాను ఏఏ కోణాల్లో తెరకెక్కిస్తారంటూ సర్వత్రా చర్చనీయాంశమైంది. ‘శ్రీదేవి అభిమానులకు నా ప్రేమలేఖ’’ అంటూ వర్మ పెట్టిన పోస్టులో బయటి ప్రపంచం ఊహించే దానికంటే సెలబ్రిటీల వాస్తవ జీవితం భిన్నంగా ఎలా ఉంటుందో... వాటన్నిటిలోకల్లా ప్రత్యేకమైనది శ్రీదేవి జీవితం అంటూ చెప్పుకొచ్చారు. శ్రీదేవీని అమితంగా ప్రేమించే రామ్‌ గోపాల్‌ వర్మ, ఆమెతో పాటు క్షణం క్షణం సినిమా తీశారు.   


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement