సైకిల్‌ చైన్‌తో కొట్టినా సరే! | Ram Gopal Varma to direct Akhil Akkineni | Sakshi
Sakshi News home page

సైకిల్‌ చైన్‌తో కొట్టినా సరే!

Mar 29 2018 1:13 AM | Updated on Jul 21 2019 4:48 PM

Ram Gopal Varma to direct Akhil Akkineni - Sakshi

రామ్‌ గోపాల్‌ వర్మ, అఖిల్‌

‘హలో’ తర్వాత అఖిల్‌ తదుపరి సినిమా ఏంటి? అనే క్యూరియాసిటీతో ఉండగానే ‘తొలిప్రేమ’ ఫేమ్‌ వెంకీ అట్లూరితో మూవీకి క్లాప్‌ కొట్టారు అఖిల్‌. ఆ సినిమా అఫీషియల్‌గా సెట్స్‌ మీదకు వెళ్లకముందే మరో సినిమా అనౌన్స్‌ చేశారు.  కానీ ఇది అనౌన్స్‌ చేసింది అఖిల్‌ కాదు ఆర్జీవీ (రామ్‌ గోపాల్‌ వర్మ). ట్వీటర్‌ అకౌంట్‌ ద్వారా అఖిల్‌తో తన తదుపరి సినిమా ఉంటుందని పేర్కొన్నారు ఆర్జీవీ. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ– ‘‘జీవితంలో ఈ సర్కిల్‌ భలే గమ్మత్తుగా ఉంది. దర్శకుడిగా నా తొలి సినిమా ‘శివ’ను నాగార్జున నటించి, నిర్మించారు.

25ఏళ్ల తర్వాత నాగార్జునతో ‘ఆఫీసర్‌’ సినిమాను స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నాను. ఇప్పుడు అఖిల్‌ని డైరెక్ట్‌ చేయబోయే సినిమాను నాగార్జున నిర్మించబోతున్నారు. ‘మీరు (నాగ్‌ని ఉద్దేశించి) నన్ను సైకిల్‌ చైన్‌తో కొట్టినా సరే.. నేనో విషయం నిజాయితీగా చెప్పదలుచుకున్నాను. మీరు ‘శివ’ సినిమా చేస్తున్నప్పుడు మీకున్న స్టైల్, యాటిట్యూడ్, వాయిస్‌ కంటే అఖిల్‌ అన్నింట్లో బెటర్‌గా ఉన్నాడు. అఖిల్‌తో నేను చేయబోయే సినిమా యంగ్‌ క్యూట్‌ లవ్‌స్టోరీ కాదు.. ఇంటెన్స్‌తో కూడిన రియలిస్టిక్‌ యాక్షన్‌ మూవీ’’ అని పేర్కొన్నారు ఆర్జీవీ.
 

Advertisement
 
Advertisement
Advertisement