‘2.ఓ’ పిల్లల సినిమా : వర్మ | Ram Gopal Varma Comments On 2Point0 Movie | Sakshi
Sakshi News home page

Nov 24 2018 12:03 PM | Updated on Nov 24 2018 12:03 PM

Ram Gopal Varma Comments On 2Point0 Movie - Sakshi

నవంబర్‌ 29న శంకర్‌, రజనీకాంత్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్‌ సినిమా 2.ఓ రిలీజ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అదే స్థాయిలో దాదాపు 10వేల స్క్రీన్స్‌పై 2.ఓను రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌చేస్తున్నారు మేకర్స్‌.

అయితే ఇంతపెద్ద సినిమా రిలీజ్‌ అయిన తరువాతి రోజే రామ్‌ గోపాల్ వర్మ ప్రమోట్‌ చేస్తోన్న భైరవగీత రిలీజ్‌ కానుంది. ఏ సందర్భానైనా తన సినిమా ప్రమోషన్‌ కోసం వాడేసుకునే వర్మ, 2.ఓను కూడా భైరవగీత ప్రమోషన్‌ కోసం వాడుకుంటున్నాడు. తాజాగా ప్రీ రిలీజ్‌ పార్టీలో పాల్గొన్న వర్మ.. 2.ఓ చిన్న పిల్లల సినిమా అంటూ తనదైన స్టైల్‌లో వివాదానికి తెర తీశాడు.

‘పెద్ద స్టార్లతో పెద్ద డైరెక్టర్‌ తీసిన చిన్న పిల్లల సినిమా 2.ఓ, చిన్న పిల్లాడు అయి సిద్ధార్థ్‌ తీసిన అడల్ట్‌ సినిమా భైరవగీత. పిల్లల సినిమా చూస్తారా.? పెద్దల సినిమా చూస్తారా?’ అంటూ అభిమానులను ప్రశ్నించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement