కెరీర్‌లో బెస్ట్ లుక్ ఇదే! | Ram Charan's Dhruva movie wraps up shooting | Sakshi
Sakshi News home page

కెరీర్‌లో బెస్ట్ లుక్ ఇదే!

Nov 15 2016 12:08 AM | Updated on Aug 3 2019 1:14 PM

కెరీర్‌లో బెస్ట్ లుక్ ఇదే! - Sakshi

కెరీర్‌లో బెస్ట్ లుక్ ఇదే!

‘శత్రువుతో ఆట... ప్రేయసితో పాట... మిత్రులతో సరదా ముచ్చట... మా ‘ధృవ’లో యాక్షన్, లవ్, కామెడీ తదితర కమర్షియల్ హంగులన్నీ ఉన్నాయి’

‘శత్రువుతో ఆట... ప్రేయసితో పాట... మిత్రులతో సరదా ముచ్చట... మా ‘ధృవ’లో యాక్షన్, లవ్, కామెడీ తదితర కమర్షియల్ హంగులన్నీ ఉన్నాయి’ అంటున్నారు దర్శకుడు సురేందర్‌రెడ్డి. రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా ఆయన దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ధృవ’. ఆదివారంతో ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. థాయ్‌ల్యాండ్‌లోని కర్బీ దీవిలో చరణ్, రకుల్‌లపై చిత్రీకరించిన చివరి పాటతో చిత్ర బృందం ‘ధృవ’కి ప్యాకప్ చెప్పేశారు.

ఈ పాటలో నా లుక్ చాలా బాగుంటుందంటున్నారు రకుల్. ‘నా కెరీర్‌లో ఇదే బెస్ట్ లుక్’ అంటూ కాస్ట్యూమ్ డిజైనర్ గీతికా చద్దాను కౌగిలించుకున్న ఫొటోను ట్వీట్ చేశారామె. ‘హిప్ హాప్’ ఆది (తమిళ) సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇటీవల విడుదలయ్యాయి. డిసెంబర్‌లో సినిమా విడుదల కానుంది. విలన్‌గా అరవింద్ స్వామి, కీలక పాత్రల్లో నాజర్, పోసాని కృష్ణమురళి, నవదీప్ తదితరులు నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement