
దుష్టశిక్షణకు వచ్చేస్తున్నాడు!
ఎట్టకేలకు రామ్‌చరణ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ అయింది
ఎట్టకేలకు రామ్‌చరణ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ అయింది. దసరా, దీపావళి మీదుగా డిసెంబర్ దాకా సాగుతూ వెళ్ళిన ‘ధృవ’ డిసెంబర్ 9న జనం ముందుకొస్తు న్నాడు. ‘విద్రోహులకు ద్రోహం చేయడం... చెడును అంతం చేయడానికి స్వార్థంగా ఆలోచించడం... ‘ధృవ’ లక్షణం.
ఆ యువకుడి వైనం ఈ చిత్రం’ అంటున్నారు దర్శకుడు సురేందర్‌రెడ్డి. రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా ఆయన దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ధృవ’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. విలన్‌గా అరవింద్ స్వామి నటించారు.