రామ్చరణ్ ఈ సారైనా కొడతాడా..? | Ram Charan Target on Overseas Market with Dhruva | Sakshi
Sakshi News home page

రామ్చరణ్ ఈ సారైనా కొడతాడా..?

Nov 28 2016 11:57 AM | Updated on Sep 4 2017 9:21 PM

రామ్చరణ్ ఈ సారైనా కొడతాడా..?

రామ్చరణ్ ఈ సారైనా కొడతాడా..?

మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తొలి సినిమాతోనే తానేంటో

మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తొలి సినిమాతోనే తానేంటో నిరూపించుకున్నాడు. ఆ తరువాత కూడా ఎన్నో ఘనవిజయాలు సాధించినా.. ఒక కల మాత్రం ఇంతవరకు నెరవేరలేదు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలందరూ ఇప్పటికే ఓవర్సీస్లో మిలియన్ డాలర్ల క్లబ్లో చేరిపోయారు. భలే భలే మొగాడివోయ్, పెళ్లిచూపులు లాంటి చిన్న సినిమాలు కూడా ఈ ఘనతను సాధించగా, తాజాగా నిఖిల్.. ఎక్కడి పోతావు చిన్నవాడా సినిమా కూడా ఈ లిస్ట్ చేరేందుకు పరుగు తీస్తుంది.

కానీ రామ్ చరణ్కు మాత్రం ఇంత వరకు మిలియన్ డాలర్ మార్క్ అందలేదు. ముఖ్యంగా చరణ్ చేసేవి ఎక్కువగా మాస్ మాసాలా ఎంటర్టైనర్స్ కావటంతో ఓవర్సీస్ ఆడియన్స్ను ఆ సినిమాలు పెద్దగా ఆకట్టుకోవటం లేదు. దీంతో ఈ సారి ఎలాగైన తన కలను నిజం చేసుకోవాలనుకుంటున్నాడు చరణ్. ధృవ సినిమా కూడా చరణ్ కలను తీర్చేలాగే ఉంది. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అవ్వటంతో పాటు. ధృవ కంటెంట్ కూడా ఓవర్సీస్ ఆడియన్స్కు నచ్చేది కావటం కలిసొస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. అనుకున్నట్టుగా ధృవ ఓవర్సీస్ మార్కెట్లో మిలియన్ డాలర్ల మార్క్ అందుకుంటుందో.. లేదో..? చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement