సింగమ్‌తో జోడీ! | Rakulprit singh team up with surya | Sakshi
Sakshi News home page

సింగమ్‌తో జోడీ!

Feb 19 2017 11:25 PM | Updated on Aug 3 2019 1:14 PM

సింగమ్‌తో జోడీ! - Sakshi

సింగమ్‌తో జోడీ!

పరెషానురా.. పరెషానురా.. అవును. రకుల్‌ప్రీత్‌సింగ్‌ను చూస్తే కుర్రకారుకు పరేషానే.

పరెషానురా.. పరెషానురా.. అవును. రకుల్‌ప్రీత్‌సింగ్‌ను చూస్తే కుర్రకారుకు పరేషానే. అంత అందంగా ఉంటారు. ప్రస్తుతం తెలుగులో అగ్రనాయికల్లో ఒకరుగా దూసుకెళుతున్నారామె. గతంలో తమిళంలో రెండు, మూడు సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఈ ఏడాది అక్కడ కూడా స్టార్‌ హీరోయిన్ల లిస్ట్‌లో చేరే అవకాశం ఉంది. మహేశ్‌బాబు హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నారామె.

ఇది కాకుండా తమిళంలో కార్తీ సరసన ‘ధీరన్‌ అధికారం ఒండ్రు’ అనే సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఆయన అన్న సూర్య సరసన సినిమా చేసే బంపర్‌ ఆఫర్‌ దక్కించుకున్నారని చెన్నై కోడంబాక్కమ్‌ సమాచారం. ఇటీవల ‘సింగం 3’ హిట్‌తో మాంచి ఊపు మీదున్న సూర్య ప్రస్తుతం విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో హిందీ చిత్రం ‘స్పెషల్‌ ఛెబ్బీస్‌’ రీమేక్‌ ‘తానా సేంద కూట్టమ్‌’లో నటిస్తున్నారు. ఆ చిత్రం తర్వాత సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇందులోనే సూర్యకు జోడీగా రకుల్‌ను ఎంచుకున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement