రిలీజ్‌ వరకూ సస్పెన్సే! | rakshaka bhatudu Shooting 60 per cent complete | Sakshi
Sakshi News home page

రిలీజ్‌ వరకూ సస్పెన్సే!

Jan 21 2017 10:49 PM | Updated on Sep 5 2017 1:46 AM

రిలీజ్‌ వరకూ సస్పెన్సే!

రిలీజ్‌ వరకూ సస్పెన్సే!

‘‘ఇటీవల విడుదలైన ఆంజనేయస్వామి ముఖంతో ఉన్న పోలీసాఫీసర్‌ ఫస్ట్‌ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.

‘‘ఇటీవల విడుదలైన ఆంజనేయస్వామి ముఖంతో ఉన్న పోలీసాఫీసర్‌ ఫస్ట్‌ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆయన ఎవరో చెప్పమని పలువురు అడిగారు. సినిమా రిలీజ్‌ వరకూ ఆ స్పెషల్‌ స్టార్‌ ఎవరు? అనేది సస్పెన్సే’’ అన్నారు దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల. రిచా పనయ్, ‘బాహుబలి’ ప్రభాకర్, బ్రహ్మానందం, కాట్రాజు, బ్రహ్మాజీ, ధనరాజ్, నందు ముఖ్య తారలుగా ఆయన దర్శకత్వంలో గురురాజ్‌ నిర్మిస్తున్న సినిమా ‘రక్షక భటుడు’. 60 శాతం చిత్రీకరణ పూర్తయింది.

నిర్మాత మాట్లాడుతూ – ‘‘కథ వినగానే థ్రిల్‌ ఫీలయ్యా. ఈ నెల ప్రథమార్థం ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌తో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. ఫిబ్రవరిలో జరిగే షెడ్యూల్‌తో షూటింగ్‌ మొత్తం పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘నేను దర్శకత్వం వహించిన గత చిత్రాలు ‘రక్ష’, ‘జక్కన్న’ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రకథాంశం ఉంటుంది’’ అని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: మల్హర్‌భట్‌ జోషి, సంగీతం: దినేశ్‌.

Advertisement
 
Advertisement
Advertisement