మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో గొడవపడిన రాఖీసావంత్‌

Rakhi Sawant Gets Into Heated Argument With Ex boyfriend  - Sakshi

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ రాఖీ సావంత్‌కు, తన మాజీ ప్రియుడికి మధ్య వాడీ వేడి మాటల యుద్ధం జరిగింది. రాఖీసావంత్‌ తనతో ప్రేమాయణం జరిపి రహస్యంగా వేరొకరిని పెళ్లి చేసుకుందని మాజీ ప్రియుడు దీపక్‌ కలల్‌ ఆరోపించారు. దీనికి పరిహారంగా రూ.4 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల రాఖీసావంత్‌ బ్రిటన్‌కు చెందిన ఎన్నారై రితేష్‌ అనే వ్యక్తిని ముంబైలోని ఓ హోటల్‌లో వివాహం  చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె మాజీ ప్రియుడు రాఖీ సావంత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తన నుంచి రాఖీ తీసుకున్న 4 కోట్ల రూపాయలను తిరిగి ఇవ్వాలని ట్విటర్‌లో తీవ్రంగా మండిపడ్డారు.  తన భర్తను వదిలేసి తనతో జీవించాలని లేకుంటే  రాఖీ జీవితం నాశనం చేస్తానని బెదిరించాడు. 

దీనిపై స్పందించిన రాఖీ సావంత్‌ దీపక్‌పై ట్విటర్‌లో తీవ్రంగా విరుచుకుపడ్డారు. మాటలు మంచిగా మాట్లాడాలని, అబద్దపు మాటలు మాట్లాడితే బాగోదని, తనను తన భర్తను ఏం చేయలేవంటూ ఘాటుగా విమర్శించారు. కాగా, దీపక్‌తో ప్రేమాయణం సాగించిన రాఖీసావంత్‌ తననే పెళ్లి చేసుకుంటుందని అభిమానులంతా ఊహించారు. కానీ వెడ్డింగ్‌ డ్రెస్‌లతో దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ, తను ఓ ఎన్నారైను పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించి చివరిలో షాకిచ్చింది రాఖీసావంత్‌. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top