గుర్మీత్‌ను నేను పెళ్లి చేసుకుంటానేమోనని..! | Rakhi Sawant comment on Honeypreet, Gurmeet | Sakshi
Sakshi News home page

గుర్మీత్‌ను నేను పెళ్లి చేసుకుంటానేమోనని..!

Sep 26 2017 6:27 PM | Updated on Sep 26 2017 6:27 PM

Rakhi Sawant comment on Honeypreet, Gurmeet

సాక్షి, ముంబై: వివాదాస్పద బాబా, రేప్‌ కేసులో శిక్ష పడిన గుర్మీత్‌ రాంరహీం సింగ్‌ జీవితకథ ఆధారంగా 'అబ్‌ హోగా ఇన్సాఫ్‌' పేరిట సినిమా తెరకెక్కించేందుకు హాట్‌ భామ రాఖీ సావంత్‌ సిద్ధమవుతోంది. ఈ సినిమాలో గుర్మీత్‌ దత్తపుత్రిక, సన్నిహితురాలు హనీప్రీత్‌ ఇన్సాఫ్‌గా రాఖీ సావంత్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన రాఖీ.. ఆసక్తికర విషయాలను వెల్లడించింది. గుర్మీత్‌ జీవితానికి సంబంధించిన ఎన్నో రహస్య అంశాలను ఈ సినిమాలో చూపిస్తానని, గుర్మీత్‌, హనీప్రీత్ గురించి తనకు చాలాకాలంగా తెలుసునని చెప్పుకొచ్చింది.

'మూడున్నరేళ్లుగా గుర్మీత్‌, హనీప్రీత్‌ గురించి నాకు తెలుసు. పలు సందర్భాల్లో వారిని నేను కలిశాను. డేరా పరిసరాల్లో నిర్మించిన గుహాలోకి సైతం నేను వెళ్లాను. గుర్మీత్‌ పుట్టినరోజు సందర్భంగా నన్ను పిలిచారు' అని రాఖీ తెలిపింది. గుర్మీత్‌ సినిమాల కోసం హనీప్రీత్‌ ఆడిషన్స్‌ నిర్వహించేదని తెలిపింది. 'ఓసారి గుర్మీత్‌, హనీప్రీత్‌ నన్ను ఓ హోటల్‌కు పలిచారు. గుర్మీత్‌ సినిమాల్లో నటించే అవకాశం కల్పిస్తానంటూ అమ్మాయిలను హనీప్రీత్‌ పిలిచేది. హోటల్‌లో ఇద్దరూ ఒకే గదిలో ఉండేవారు. అక్కడ బాత్రూమ్‌లో కొన్ని మూలికలు చూశాను. పాపపు ఉద్దేశంతో వాటిని అక్కడ ఉంచినట్టు నేను భావించాను. అతని నిజమైన ఉద్దేశాలు గ్రహించి నేను బెంబేలెత్తిపోయాను. నన్ను చంపేస్తాడేమోనని భయపడ్డాను' అని రాఖీ చెప్పింది.

గుర్మీత్‌కు తాను సన్నిహితంగా ఉండటం చూసి హనీప్రీత్‌ ఆందోళన చెందేదని రాఖీ పేర్కొంది. 'తన ప్రియుడిని నేను పెళ్లి చేసుకుంటానేమోనని హనీప్రీత్‌ భయపడేది. గుర్మీత్‌ తన మహిళా శిషురాళ్లను లైంగికంగా దోచుకుంటున్న విషయం నాకు అప్పటికీ తెలియదు' అని చెప్పుకొచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement