సూపర్‌స్టార్ రజనీ కాంత్‌ను ఆయన అభిమానులు ఇంతకు ముందు తరచూ కలిసేవారు. అలాంటి సమావేశం జరిగి 10 ఏళ్లు కావస్తోంది.
చెన్నై: సూపర్‌స్టార్ రజనీ కాంత్‌ను ఆయన అభిమానులు ఇంతకు ముందు తరచూ కలిసేవారు. అలాంటి సమావేశం జరిగి 10 ఏళ్లు కావస్తోంది. మధ్యలో రజనీకాంత్ తన అభిమానులను కలవాలని భావించినా అనివార్యకారణాల వల్ల కుదరలేదు. ఈ నెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ రజనీకాంత్ రాష్ట్రంలోని నలుమూలలకు చెందిన అభిమానుల్సి చెన్నైకి ఆహ్వానించి మంచి విందునిచ్చి వారితో ఫొటోలు దిగే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
అయితే అభిమానులు విడివిడిగా తమ అభిమాన నటుడితో ఫొటోలు దిగాలని ఆశపడడంతో అలా సుమరు 15 వేల మందితో నిర్ణయించిన తేదీలో విడివిడిగా ఫొటోలు దిగడం సాధ్యం కాదని భావించిన రజనీకాంత్ ఈ అభిమానులతో కలయిక అనే కార్యక్రమాన్ని వాయిదా వేసి నట్లు ప్రకటించారు.
తాజాగా మరోసారి అభిమానులతో కలవడానికి రజనీకాంత్ కొత్తగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు, బహుశా మే నెల మూడో వారంలో గానీ, జూన్‌లో గానీ ఆ కార్యక్రమం ఉంటుందని సమాచారం. అయితే ఈ కార్యక్రమంలో అభిమానులు మినహా ఇతరులెవరికీ అనుమతి ఉండదని సమాచారం.