ఆ సినిమా కబాలి 2 కాదు | Rajinikanth, Pa Ranjith Not Working For Kabali 2 | Sakshi
Sakshi News home page

ఆ సినిమా కబాలి 2 కాదు

Sep 1 2016 11:56 AM | Updated on Sep 4 2017 11:52 AM

ఆ సినిమా కబాలి 2 కాదు

ఆ సినిమా కబాలి 2 కాదు

రజనీకాంత్ హీరోగా కబాలి సినిమాను తెరకెక్కించిన పా రంజిత్, ఆ సినిమాతో ఆశించిన స్థాయి విజయం సాధించకపోయినా.. క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఒక సమయంలో టాప్ స్టార్లు కూడా పా రంజిత్ దర్శకత్వంలో సినిమా...

రజనీకాంత్ హీరోగా కబాలి సినిమాను తెరకెక్కించిన పా రంజిత్, ఆ సినిమాతో ఆశించిన స్థాయి విజయం సాధించకపోయినా.. క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఒక సమయంలో టాప్ స్టార్లు కూడా పా రంజిత్ దర్శకత్వంలో సినిమా చేయడానికి క్యూ కట్టారు. అయితే కబాలి రిలీజ్ తరువాత మాత్రం సీన్ మారిపోయింది. ఆ సినిమా నిర్మాతలకు లాభాలు తీసుకు వచ్చినా.. డిస్ట్రిబ్యూటర్లు చాలా చోట్ల నష్టపోయారు. దీంతో ఇక రంజిత్కు స్టార్ హీరోలు ఛాన్స్ ఇవ్వటం కష్టమనే భావించారు అంతా.

కానీ అందరికీ షాక్ ఇస్తూ రజనీ హీరోగా పా రంజిత్ మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడన్న వార్త హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమాను తానే నిర్మిస్తున్నట్టుగా రజనీ అల్లుడు, తమిళ హీరో ధనుష్ స్వయంగా ప్రకటించారు. దీంతో రజనీ హీరోగా రంజిత్ తెరకెక్కించబోయే సినిమా కబాలి 2 అంటూ ప్రచారం జోరుగా జరిగింది. ఈ విషయంపై స్పందించిన దర్శకుడు పా రంజిత్ క్లారిటీ ఇచ్చాడు.

తాను రజనీ హీరోగా మరో సినిమా చేస్తున్న మాట నిజమేనని అయితే ఆ సినిమా కబాలి సీక్వల్ మాత్రం  కాదని ప్రకటించాడు. ఓ కొత్త కథను రజనీకి వినిపించానని ఆయనకు కథ నచ్చి స్క్రిప్ట్ రెడీ చేయమన్నారని తెలిపాడు. ప్రస్తుతం రజనీ హీరోగా తెరకెక్కుతున్న రోబో సీక్వల్ పూర్తవ్వగానే పా రంజిత్ దర్శకత్వంలో మరో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement