అల్లుడి కోసం రజనీ

Rajinikanth Has A Request For Director Karthik Subbaraj - Sakshi

సక్సెస్‌ అవకాశాలను కుమ్మరిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు యువ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ పరిస్థితి అలానే ఉంది. ఆ మధ్య మెర్కూరి, ఇరైవి చిత్రాలు కాస్త తేడా కొట్టడంతో నిరాశ చెందిన ఈ యువ దర్శకుడికి సూపర్‌ స్టార్‌ రూపంలో భారీ ఆఫర్‌ వచ్చింది. అదే పేట. ఈ చిత్రం రజనీకాంత్‌ను ఖుషీ పరచడంతో పాటు ఆయన కెరీర్‌లో మరో సంచలన చిత్రంగా నమోదు అయ్యింది.

పేట చిత్రంలో రజనీకాంత్‌ను 20 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లి చాలా యూత్‌గా స్టైలిష్‌గా చూపించడంతో దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ విజయవంతం అయ్యాడు. దీంతో బాగా ఇంప్రెస్‌ అయిన రజనీ కార్తీక్‌ సుబ్బరాజ్‌కు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో సూపర్‌స్టార్‌, సుబ్బారాజ్‌ను పిలిచి తన చిన్నల్లుడు విశాఖన్‌ హీరోగా ఒక చిత్రంగా చేయాల్సిందిగా కోరినట్లు తాజా సమాచారం.

ఈ ఆఫర్‌కు సుబ్బరాజు వెంటనే ఓకే చెప్పేశారట. విశాఖన్‌ రజనీకాంత్‌ రెండవ కూతురు సౌందర్య భర్త అన్న విషయం తెలిసిందే. గతంలో విశాఖన్‌ వంజగర్‌ ఉలగం చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించారు. యువ వ్యాపారవేత్త అయిన విశాఖన్‌కు నటనపై ఆసక్తి అట. దీంతో ఆయన్ను హీరోగా పరిచయం చేయమని తలైవా దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ను కోరినట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు అధికారిక పూర్వకంగా వెలువడాల్సి ఉంది.

పేట చిత్రం తరువాత కార్తీక్‌ సుబ్బరాజ్‌ ధనుష్‌తో ఒక చిత్రం చేయబోతున్నారు. దీని తరువాత విశాఖన్‌తో చిత్రం చేసే అవకాశం ఉంది. అలా రజనీకాంత్‌ అళ్లుళ్లు ఇద్దరూ కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంతో బిజిగా ఉన్నారన్న మాట.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top