అదీ.. సూపర్ స్టార్ స్టామినా..! | rajani kanth kabali records | Sakshi
Sakshi News home page

అదీ.. సూపర్ స్టార్ స్టామినా..!

Jun 5 2016 12:23 PM | Updated on Sep 4 2017 1:45 AM

అదీ.. సూపర్ స్టార్ స్టామినా..!

అదీ.. సూపర్ స్టార్ స్టామినా..!

రెండు సినిమాలు భారీ డిజాస్టర్లు అయిన తరువాత ఎంతటి స్టార్ హీరోకయినా వెనకడుగు తప్పదు. ఆ తరువాత చేయబోయే సినిమాల రికార్డ్లు, బిజినెస్ విషయంలో ఆ ఫ్లాప్ సినిమాల ప్రభావం బాగానే...

రెండు సినిమాలు భారీ డిజాస్టర్లు అయిన తరువాత ఎంతటి స్టార్ హీరోకయినా వెనకడుగు తప్పదు. ఆ తరువాత చేయబోయే సినిమాల రికార్డ్లు, బిజినెస్ విషయంలో ఆ ఫ్లాప్ సినిమాల ప్రభావం బాగానే కనిపిస్తోంది. కానీ సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఇలాంటి వాటికి అతీతుడని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. రజనీ హీరోగా తెరకెక్కిన కొచ్చాడయాన్, లింగా సినిమాలు భారీ డిజాస్టర్లు అయినా, కొత్త సినిమా కబాలీ సరికొత్త రికార్డ్లు సృష్టిస్తోంది.

రజనీ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ అయిన కబాలీ టీజర్ హాలీవుడ్ సినిమాలకు కూడా చెమటలు పట్టిస్తోంది. ఇప్పటికే 2 కోట్లకు పైగా వ్యూస్తో రికార్డ్ సృష్టించిన కబాలీ ప్రపంచంలో అత్యధిక మంది వీక్షించిన టీజర్గా రికార్డ్ సృష్టించింది. అవేంజర్స్ లాంటి హాలీవుడ్ సినిమాలను కూడా వెనక్కి నెట్టి రజనీ సాధించిన రికార్డ్తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఇక బిజినెస్ విషయంలో కూడా రజనీ తన స్టామినాను ప్రూవ్ చేసుకుంటున్నాడు. డిజాస్టర్ టాక్తో కూడా రజనీ లింగా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించటంతో ఇప్పుడు కబాలీ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా రిలీజ్కు ముందే కబాలీ 200 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఇండియాతో పాటు రజనీకి బాగా పట్టున్న జపాన్, తొలిసారిగా మలేషియాలో కూడా భారీగా కబాలీ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

రజనీ సరసన రాధికా ఆప్టే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు పా రంజిత్ దర్శకుడు. తమిళ బ్యూటి ధన్సిక లేడీ డాన్గా కనిపిస్తుండగా, మరికొంత మంది హాలీవుడ్ స్టార్లు విలన్లుగా నటించారు. కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ సినిమా ఆడియోను ఈ నెల 11న,  సినిమాను జులై 1న రిలీజ్ చేయనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement