‘గీత గోవిందం’ సినిమాపై రాజమౌళి ట్వీట్‌ | Rajamouli Tweet On Geetha Govindam | Sakshi
Sakshi News home page

‘గీత గోవిందం’ సినిమాపై రాజమౌళి ట్వీట్‌

Aug 15 2018 9:02 PM | Updated on Jul 14 2019 4:05 PM

Rajamouli Tweet On Geetha Govindam - Sakshi

అర్జున్‌ రెడ్డి సినిమాతో ఓవర్‌ నైట్‌స్టార్‌గా మారిన విజయ్‌ దేవరకొండ.. తన ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా చేసిన సినిమా ‘గీత గోవిందం’. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘గీత గోవిందం’ ఈరోజు(బుధవారం) విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా చూసిన అనంతరం దర్శక ధీరుడు రాజమౌళి.. విజయ్‌ నటనను ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు.

‘‘గీత గోవిందం’  సినిమా చూసి చాలా నవ్వుకున్నాను. విజయ్‌ దేవరకొండ.. నీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు. కానీ అర్జున్‌ రెడ్డి వంటి సినిమా తర్వాత ఇది నీ బెస్ట్‌ చాయిస్‌. తానేం చేస్తున్నాడో విజయ్‌కు బాగా తెలుసు. సినిమా అంతా సరదా సన్నివేశాలతో నింపేశారు. సినిమాను చాలా బాగా తెరకెక్కించావు పరశురాం..’  అంటూ దర్శక ధీరుడు రాజమౌళి.. గీత గోవిందం టీమ్‌పై ప్రశంసలు కురిపించాడు.

Advertisement
 
Advertisement
Advertisement