చిరు వేడుకకు రాజమౌళి | Rajamouli to Launch Uyyalawada Narasimha Reddy First Look | Sakshi
Sakshi News home page

చిరు వేడుకకు రాజమౌళి

Aug 19 2017 12:05 PM | Updated on Jul 14 2019 4:05 PM

చిరు వేడుకకు రాజమౌళి - Sakshi

చిరు వేడుకకు రాజమౌళి

బాహుబలి 2 సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు రాజమౌళి.

బాహుబలి 2 సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు రాజమౌళి. ప్రస్తుతం హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న ఈ గ్రేట్ డైరెక్టర్ తన సన్నిహితుల సినిమా వేడుకల్లో సందడి చేస్తున్నారు. అయితే త్వరలో జరగనున్న ఓ ప్రతిష్టాత్మక చిత్ర వేడుకకు రాజమౌళి ముఖ్య అతిథిగా హజరుకానున్నారట. బాహుబలి స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా కోసం దర్శక బాహుబలి వస్తున్నాడన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఖైదీ నంబర్ 150 సినిమాతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, తన నెక్ట్స్ సినిమాను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నాడు. తొట్టతొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కబోయే సినిమాలో నటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాను లాంచనంగా ప్రారంభించారు. మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22న టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ లను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ వేడుకకు రాజమౌళీ హజరుకానున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. యువ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో పాటు మరికొందరు పరాభాష నటులు కనిపించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement