రజనీతో సినిమాపై రాజమౌళి స్పందన | Rajamouli responds about movie with Rajinikanth | Sakshi
Sakshi News home page

రజనీతో సినిమాపై రాజమౌళి స్పందన

May 3 2017 3:01 PM | Updated on Jul 14 2019 4:05 PM

రజనీతో సినిమాపై రాజమౌళి స్పందన - Sakshi

రజనీతో సినిమాపై రాజమౌళి స్పందన

బాహుబలితో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం హాలీడే మూడ్లో ఉన్నాడు. ఐదేళ్లుగా

బాహుబలితో  అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం హాలీడే మూడ్లో ఉన్నాడు. ఐదేళ్లుగా బాహుబలి పనులతో అలసిపోయిన జక్కన్న ప్రస్తుతం లండన్లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే అక్కడ కూడా రాజమౌళిని మీడియా విడిచిపెట్టడం లేదు. అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ జక్కన్నను ఇంటర్య్వూ చేసింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు రాజమౌళి.

ముఖ్యంగా బాహుబలి తరువాత రాజమౌళి చేయబోయే సినిమాపై ప్రదానంగా చర్చ జరుగుతుంది. రజనీకాంత్ లాంటి స్టార్ హీరోతో రాజమౌళి సినిమా చేస్తే అవతార్ రికార్డ్లు కూడా బ్రేక్ అవుతాయంటూ పలువురు సినీ ప్రముఖులు కామెంట్ చేయటంతో రాజమౌళి.. ఇంటర్య్యూలో ఈ విషయం పై స్పందించాడు. 'రజనీకాంత్ ఇండియాలోనే టాప్ స్టార్స్ లో ఒకరు. ఏ దర్శకుడైనా ఆయనతో సినిమా చేయాలనుకుంటాడు. నేను కూడా చేయాలనుకుంటున్నాను. అయితే ఆయన ఇమేజ్కు తగ్గ కథ దొరికితే తప్పకుండా రజనీతో సినిమా చేస్తాను. ఆ అవకాశం వస్తే నాకన్న సంతోషించే వ్యక్తి మరొకరు ఉండరు'  అన్నాడు.

ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 ప్రస్తుతం కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఇప్పటికే 700 కోట్ల కు పైగా వసూళ్లు సాధించిన ఈ భారీ చిత్రం, సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఏరియాల్లో రికార్డ్ లను తిరగరాస్తోంది. అంతేకాదు ఓవర్ సీస్ లోనూ హయ్యస్ట్ గ్రాసర్ గా ఉన్న దంగల్ రికార్డ్ ను మరో 24 గంటల్లో బాహుబలి 2 బద్ధలు కొట్టడం కాయంగా కనిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement