రాహుల్‌ చేజారిన రాములో రాములా సాంగ్‌..

Rahul Sipligunj Was First Choice For Ramulo Ramula Song - Sakshi

హైదరాబాద్‌ : అల వైకుంఠపురములో మూవీ నుంచి విడుదలైన రెండో సాంగ్‌ రాములో రాములా..విశేషంగా అలరిస్తూ మిలియన్‌ వ్యూస్‌తో దూసుకుపోతోంది. అనురాగ్‌ కులకర్ణితో ఈ పాట పాడించే ముందు బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ను చిత్ర బృందం సంప్రదించినట్టు సమాచారం. రాహుల్‌తో ఈ పాట పాడించాలని మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌ ఎస్‌ తమన్‌ ప్రయత్నించారు. ఈ పాట రఫ్‌ ట్రాక్‌ను తాను పాడానని రాహుల్‌ సైతం చెప్పుకొచ్చారు. అంతలోనే రాహుల్‌ బిగ్‌బాస్‌ తెలుగు 3 సీజన్‌ కోసం హౌస్‌లో ఎంటరవడం మూడు నెలలకు పైగా అక్కడే గడపడంతో అన్ని రోజులు వేచిచూడటం సాధ్యం కాక అనురాగ్‌ కులకర్ణితో రాములో రాములాను పాడించేశారు.

ఈ పాట యూట్యూబ్‌లో యువతను ఓ రేంజ్‌లో ఉర్రూతలూగిస్తున్న సంగతి తెలిసిందే. యూట్యూబ్‌లో ఈ పాట వీడియోను వీక్షించిన కొందరు సంగీత ప్రియులు ఈ సౌండ్‌ట్రాక్‌కు రాహుల్‌ పరిపూర్ణంగా న్యాయం చేసేవారని బదులిచ్చారు. ఈ పాటకు రాహుల్‌ గొంతు చక్కగా సరిపోయేదని కామెంట్స్‌ చేశారు. రాహుల్‌తో ఈ పాటను తిరిగి పాడించాలని, అప్పుడు మరింత పెద్ద హిట్‌ అవుతుందని తమన్‌కు వారు సలహా కూడా ఇచ్చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top